రామాయణం పురాణగాధ కాదని.. ఇది నిజంగా జరిగిన చరిత్ర అంటూ చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఎన్నో ఆనవాళ్లు దొరికాయంటూ చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రావణ రాజ్యమైన శ్రీలంలో కుంభకర్ణుడి ఖడ్గం లభించినట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. శ్రీలంలో జరిగిన తవ్వకాల్లో కుంభకర్ణుడి ఖడ్గం దొరికిందనేది పరమార్థం. వినోద్ యాదవ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ఎక్స్‌లో కుంభకర్ణుడి కత్తి ంటూ ఓ వీడియోను పోస్టు చేశాడు. సదరు పోస్టులో మాత్రం భారీ ఖడ్గానికి సంబంధించిన నాలుగు చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఇది 5000బీసీ కాలం నాటిదిగా ప్రచారం చేస్తున్నారు. కానీ దీనిపై నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇదినిజమేనంటూ ఎంతో మంది రీ పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గామారింది. రామాయాణాన్ని విమర్శించే వారు ఇదే ఇదిగో సాక్ష్యంటూ అంటూ పేర్కొంటున్నారు. కానీ ఇది కుంభకర్ణుడి ఖడ్గమని శ్రీలంక ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీపావళి ఈ ప్రచారం హాట్‌టాపిక్‌గామారింది.శ్రీలంక ఈ విషయాన్ని దాస్తోందనే ప్రచారమూ సాగుతోంది.
ఎవరీ కుంభకర్ణుడు
లంకను రావణాసురు పాలించేవాడు. ఇతడి సోదరుడే కుంభకర్ణుడు. కుంభకర్ణుడు కఠిన తపస్సు చేసిన బ్రహ్మదేవుడి అనుగ్రహం పొందుతాడు. అయితే వరం కోరుకునే సమయంలో సరస్వతీదేవి కుంభకర్ణుడి నాలుకపై చేరి, నిద్ర కావలెను అనేలా చేస్తుంది. దాంతో బ్రహ్మదేవుడు నిద్రను వరంగా ఇస్తాడు. అతడికి నిద్ర భంగం కలిగినే చనిపోతాడు. ఇదిలాఉండగా రామ, రావణ యుద్ధం తార స్థాయికి చేరుకోవడంతో రావణుడు కుంభకర్ణుడిని యుద్ధానికి సన్నద్ధం చేస్తాడు. నిద్ర భంగం కారణంగానే కుంభకర్ణుడు రాముడి చేతిలో మరణించినట్టు రామాయణ గాధను బట్టి తెలుస్తోంది. ఇదేకాక కుంభకర్ణుడి జన్మ రహస్యంపై వివిధ కథనాలు పురాణగాధ ల్లో ఉంది.
https://x.com/Vinodyadav7_/status/1850522592450351263?t=qV5V4vftVdNO8nitVzcM6w&s=08
https://x.com/Vinodyadav7_/status/1850522592450351263?t=qV5V4vftVdNO8nitVzcM6w&s=08
ఇవీ చదవండి..
1. చరిత్ర సృష్టించిన అయోధ్య..
[…] దొరికిన కుంభకర్ణుడి ఖడ్గం […]