పోలీసులకు దీపావళి శుభవార్త
హైదరాబాద్ : పోలీసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి శుభవార్త తెపింది. పెండిరగ్‌లో ఉన్న సరెండర్ లీవ్‌ల బడ్జెట్ రూ.182.48 కోట్లను విడుదల చేస్తూ రేవంత్ రెడ్డి పోలీస్ సిబ్బందికి ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కల ఆదేశాల మేరకు ఆర్థికశాఖ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఎంతోకాలంగా పోలీస్ సిబ్బంది సరెండర్ లీవ్‌లకు సంబంధించిన బడ్జెట్ ఎదురుచూపులకు తెరపడింది. ప్రభుత్వ నిర్ణయంతో పోలీస్ అధికారుల సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే దశలవారీగా మిగిలిన బకాయిలను మంజూరు చేసేందుకు త్వరితగతిన ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇంతకాలం పోలీసు సిబ్బందికి సరెండర్ డబ్బులు సకాలంలో అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పండుగలు, పర్వదినాలు, ఆదివారాలు, సెలవుల వంటి ముఖ్యదినాల్లో పోలీసులు విధులు నిర్వహించారు. వీటి సంబంధించిన ప్రోత్సాహకాలు అందించేందుకు సర్కారు నిర్ణయించింది. గత ఏడాది జూలై, నవంబర్‌తోపాటు ఈ సంవత్సరం జనవరికి సంబంధించిన ప్రోత్సహాలు చాలా మంది పనిచేసిన పోలీసు సిబ్బందికి అందించలేదు. అందుకే వీరికి ప్రోత్సాహకంగా ప్రభుత్వం సరెండర్ లీవ్స్ పేరుతో ప్రోత్సాహకం అందిస్తోంది.
ప్రజావాణికి 588 దరఖాస్తులు రాక
హైదరాబాద్: హదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో ప్రజావాణి మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చి తమ గోడు అధికారులకు వెల్లబోసుకున్నారు. మొత్తం 588 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. దరఖస్తులో్ల మైనారిటీ వెల్ఫేర్ శాఖకు చెందినవి 221, , విద్యుత్ శాఖ కు చెందినవి 84, రెవెన్యూ పరమైనవి 55, పంచాయతీ రాజ్ , గ్రావిూణాభివృద్ధి శాఖ కు సంబంధించి 98, అలాగే ప్రవాసీ ప్రజావాణి ద్వారా 4, ఇతర శాఖలకు సంబంధించి 126 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.