Marriage Breakeup : కాంగ్రెస్‌ కార్యకర్తల అత్యుత్సాహంతో ఓ యువ ఐపీఎస్‌ వివాహం పెళ్లిపీటలపై ఆగిపోయింది. దీంతో పెళ్లికుమార్తె తల్లికి గుండెపోటు వచ్చింది. పెళ్లి కొడుకు ఇంటిముందు పెళ్లికూతురు బంధువులు ఆందోళన చేయగా.. చివరకు ఐపీఎస్‌ పెళ్లికి అంగీకరించాడు. ఏపీలోని గుంటూరుకు చెందిన ఓ ఐపీఎస్‌ అధికారితో తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కుమార్తెతో వివాహం నిశ్చయించారు. దీంతో డిసెంబరు 17న సాయంత్రం గుంటూరులోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ పెళ్లి వేడుకకు తెలంగాణ నుంచి భారీగా కాంగ్రెస్‌ కార్యకర్తలు గుంటూరుకు తరలివచ్చారు. ఆ క్రమంలో పెళ్లి కుమారుడు ఇంటి నుంచి కాంగ్రెస్‌ జెండాలతో భారీ ఊరేగింపుగా తీసుకువెళ్లేందుకు నాయకులు ప్రయత్నించారు.
దానిపై వ‌రుడు అభ్యంత‌రం వ్య‌క్తం చేశాడు. వ‌రుడు ఐపీఎస్ అధికారికావ‌డంతో రాజ‌కీయ జెండాల ప్ర‌ద‌ర్శ‌న స‌రైందికాంటూ వ‌రుడి బంధువులు న‌చ్చ జెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అయినా పెళ్లి కుమార్తె బంధువుల ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ వ‌రుడు పెళ్లికి నిరాక‌రించాడు. దాంతో ఉత్కంఠ నెల‌కొంది.

READ MORE: పుష్పా-2 ఎఫెక్ట్‌: సంధ్య థియేటర్‌కు పోలీసుల షాక్‌ 

Marriage Breakeup:  వ‌రుడు పెళ్లికి నిరాక‌రించిన విష‌యం తెలియ‌గానే వ‌ధువు త‌ల్లిం గుండెపోట‌కు గురైంది. దాంతో ప‌రిస్థ‌తి చేజారిపోయింది. ఈ క్ర‌మంలో కార్య‌క‌ర్త‌లు వ‌రుడి ఇంటి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. వ‌రుడితో చ‌ర్చించి ఎట్ట‌కేల‌కు పెళ్లికి ఒప్పించ‌డంతో క‌థ సుఖాంత‌మైంది. దాంతో బుధవారం సాయంత్రం.. అదే వివాహ వేదికగా పెళ్లి ముహూర్తం ఇరు వర్గాల పెద్దలు నిశ్చయించారు. ఈ ఐపీఎస్‌ అధికారి గుజరాత్‌ కేడర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అదీకాక.. జిల్లాలో సదరు కాంగ్రెస్‌ నాయకుడికి భారీగా కేడర్‌ ఉంది.

READ MORE:  భారత్‌కు సొంత స్పేస్‌ స్టేషన్‌

READ MORE: చ‌లో శుక్రయాన్ !

READ MORE: ఎడారి మాయం.. సౌదీ అరేబియాలో వింత‌..

READ MORE: సిరియాల ఇజ్రాయిల్ మ‌ధ్య వార్ ఎందుకు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *