మతపరమైన ఓ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసి ఓ ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. తమిళనాడు జిల్లా కాంచిపురం జిల్లా కరవిమలైలోని శ్రీమాప్పిళ్లై వినాయగర్‌ ఆలయం ఉంది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారం కల్యాణోత్సవానికి నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఓ యూత్‌ సభ్యులు కూడా తమ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ ప్రస్తుతం వివాదాస్పదమైంది. అదేంటంటే సభ్యుల పేర్లు, ఫొటోలను ఆధార్‌కార్డుల రూపంలో వినూత్న రూపంలో ఫ్లెక్సీ తయారు చేసి భక్తులకు స్వాగతంటూ పేర్కొన్నారు. ఇదే ఫ్లెక్సీలో పెద్ద సైజులో

అమ్మవారి చి త్రాన్ని ఉంచగా, పక్కనే అమెరికా పోర్న్‌ స్టార్‌ మియా ఖలీఫా (Miakhalifa)ఫొటోను కూడా ఉంచారు. అంతేకాదు, పసుపురంగు డ్రెస్‌లో ఉన్న మియాఖలీఫా ముఖానికి బొట్టు, నెత్తిన బోనంతో వస్తున్నట్టు చిత్రీకించారు. దీంతో ఫ్లెక్సీ చూసిన వారంతా అవాక్కయ్యారు. ఈ విషయం కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దేశ వ్యాప్తంగా నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. సమస్యల ముదరుతుండడంతో స్పందించిన పోలీసులు వెంటనే ఆ ఫ్లెక్సీని తొలగించారు.

అయితే ఈ ఫ్లెక్సీకి తమకు ఎలాంటి సంబంధం లేదని నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా, వర్షం, నదికి కృతజ్ఞతగా ఇక్కడ ఆది ఉత్సవ్‌ను నిర్వహించడం ఆనవాయితీ. ఈ వేడుకను అత్యంత ఘనంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. తమిళనాడు సంప్రదాయంలో దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నాగతమ్మన్‌, సెల్లీ అమ్మన్‌(పార్వతి)గా కొలుస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *