MISSION SHUKRAYAN: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే వీనస్‌తోపాటు గగన్‌యాన్, చంద్రయాన్-3 ప్రాజెక్టులకు శరవేగంగా రెడీ అవుతుండగా, తాజాగా మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అదే శుక్రయాన్ మిషన్. 2028లో ఇస్రో శుక్రయాన్ మిషన్ ప్రయోగించేందుకు సమాయత్తమవగా ఈ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంతోషం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టుకు కేంద్రం ఓకే చెప్పినట్టు ఇస్రో డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ వెల్లడించారు. శుక్రయాన్ శుక్రుడి వాతావరణంపై పరిశోధన చేయనుంది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలతో సింథటిక్ ఎపర్చర్ రాడార్, ఆల్ట్రావైలెట్ ఇమేజింగ్ సిస్టమ్‌తో సల్ఫ్యూరిక్ ఆమ్లం, దట్టమైన కార్బన్‌డయాక్సైడ్, అగ్నిపర్వతాలను గుర్తించడంతో పాటు శుక్రగ్రహం భౌగోళిక కార్యకలాపాలను శుక్రయాన్ పరిశోధించనుంది.
MISSION SHUKRAYAN: వీనస్ ఆర్బిటర్ మిషన్ శుక్ర శాస్త్రాన్ని ప్రభావితం చేయబోతోంది. వీనస్ రహస్యాలను ఛేధించేందుకు ఇస్రో సమాయత్తమైంది. 1960, 1970లలో నాసా, , సోవియట్ యూనియన్ చేసిన ప్రారంభ మిషన్లు వీనస్ కాలిపోతున్న ఉపరితల ఉష్ణోగ్రత, దట్టమైన వాతావరణాన్ని వెల్లడించాయి. ఈ మిషన్లు గ్రహం వాతావరణ కూర్పు, ఉపరితల లక్షణాలు, అయస్కాంత వాతావరణంలో ప్రారంభ విషయాలను అందించాయి. 1970, 1980లలో పయనీర్ వీనస్, వేగా వంటి మిషన్లు వీనస్ వాతావరణంపై పరిశోధనలు జరిపాయి. కూర్పు, ప్రసరణ, సూర్యునితో అనుసంధానమైనట్టు గుర్తించాయి. వీనస్ ఎక్స్‌ప్రెస్ మరియు అకాట్సుకి వంటి ఇటీవలి మిషన్‌లు గ్రహం యొక్క వాతావరణ డైనమిక్స్, వాతావరణ పరిణామం మరియు ఉపరితల లక్షణాలను అధ్యయనం చేయడంపై దృష్టి సారించాయి.
చంద్రయాన్-4కు ప్లాన్..
MISSION SHUKRAYAN: ఇస్రో వినూత్న ప్రయోగాలకు రెడీ అయింది. ప్రపంచ అంతరిక్షరంగంలో ఇండియా పేరు ఇనుమడింపజేయడానికి నిరంతర కృషి చేస్తోంది. ఇస్రో ఇప్పటికే చంద్రయాన్-3 ప్రాజెక్టు ప్రయోగానికి శరవేంగా పనులు చేస్తుండగా, అది విజయవంతంగా కాగానే చంద్రయాన్-4 కు కూడా రెడీ అయింది. చంద్రుడిపై మట్టి, రాతి నమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి చేరుకునేలా చంద్రయాన్-4 ప్రయోగం ద్వరా చేపట్టబోతున్నది. కేంద్రం ఆమోదం తెలిపతే 2030 నాటికే మిషన్‌ను కంప్లీట్ చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. జపాన్‌తో కలిసి చంద్రయాన్-4 ఇస్రో చేపట్టనున్నది.