TATA NANO EV CAR:  ఇండియాలో ఎలక్ట్రిక్ (ఈవీ) వాహ‌నాల‌కు వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. వినియోగ‌దారుల డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు చేస్తున్నాయి. ఇండియాలో పెట్ర‌లో ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంతో సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి జ‌నం ఈవీ వాహ‌నాల‌పై మ‌క్కువ చూపుతున్నాయి. వారినే టార్గెట్ చేస్తూ భాత‌ర వాహ‌న త‌యారీ దిగ్గ‌జ సంస్థ టాటా కంపెనీ వినూత్న ఆవిష్క‌ర‌ణ‌కు శ్రీ‌కారం చుట్టుంది. ఇందులో భాగంగానే టాటా కంపెనీకి చెందిన‌ టాటా నానో ఈవీ భారత మార్కెట్లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మధ్యతరగతి ప్ర‌జ‌ల‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కారులో ప‌లు మార్పులు చేసేందుకు రెడీ అయింది. ఇప్ప‌టికే టాటా కంపెనీ నుంచి వ‌చ్చిన హ్యాచ్ బ్యాక్ కారు ఒక‌టి. టియాగో, SUV నెక్సాన్ మార్కెట్‌లో దూసుకుపోతోంది.

ఈవీ బ్రాండ్ గా మారుతున్న టాటా కంపెనీ..

ఇండియాలో ఎల‌క్ట్రిక్ కార్ల‌కు ఈవీలకు టాటా బ్రాండ్ కేరాఫ్ గా మారుతోంది. ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ వాహనం టియాగో రూ. 8 నుంచి రూ.10 లక్షలు నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఈ ధ‌ర ఎక్స్ షో రూంగా కంపెనీ ప్ర‌క‌టించింది. త‌క్కువ ధ‌ర‌లో ఈవీల కోసం చూసేవారికి టాటా నానో మంచి ప్ర‌త్యామ్నాయంగా కంపెనీ చెబుతోంది. విఫ‌ణిలోకి కేవ‌లం రూ.ల‌క్ష నానో కారును తెచ్చిన టాటా వివిధ కార‌ణాల‌తో 2018లో నానో కార్ల‌ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. దీనికి వివిధ కార‌ణాలు ఉన్నా.. నానోకు మ‌రింత నాణ్య‌మైన కార్ల‌ను త‌యారు చేస్తూ మార్కెట్‌ను త‌న‌వైపు తిప్ప‌కునే ప‌నిలో ప‌డింది. ఆ తర్వాత టాటా నానో కారు ఎలక్ట్రిక్ వెర్షన్‌పై పని చేయ‌డం ప్రారంభించిందికాగా 2015లో టాటా నానోకు సంబంధించి కొన్ని కంపెనీలతో కంపెనీ ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. టాటా నానో ఈవీని మరింత సరసమైన ధరకు రూపొందించి సామాన్య ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని చూస్తోంది. 2022లో ఎలక్ట్రా ఈవీ అనే కంపెనీ, టాటా నానోలో ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను తిరిగి అమర్చింది.

2024 ప్రారంభంలో టాటా..

మార్కెట్ ఎంజీ మోటార్ బ్యాటరీ పరికరాల ధర తగ్గడంతో నానా కూడా రేట్ల‌ను త‌గ్గిస్తోంది. 2024 నంచి టాటా కంపెనీ కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్ప‌త్తుల రేట్లను త‌గ్గిస్తూ వ‌స్తోంది. ఎంజీ కామెట్ ఈవీ వెహికల్స్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే అతిత‌క్క‌వ ధ‌ర‌లో ల‌భిస్తోంది. ఇది కేవ‌లం రూ. 7 లక్షల నుంచి వివిధ ధ‌ర‌ల్లో అందుబాటులో ఉన్న‌టు్ట కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం టియాగో ఈవీ కార్ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్ దిల్లీ). టాటా నానో ఈవీకి దాదాపు రూ. 6 లక్షల ఎక్స్-షోరూమ్ ధరను ఫిక్స్ చేసే అవ‌కాశం ఉంద‌ని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయ‌.

ఫీచ‌ర్స్ అదుర్స్‌..

టాటా నానో ఎలక్ట్రిక్ వాహ‌నం ఫీచ‌ర్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, ఏసీ, బ్లూటూత్, ఫ్రంట్ పవర్స్ విండోస్, రిమోట్ లాకింగ్ సిస్టమ్, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో, టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్ లాంటి అనేక‌ ఫీచర్లు ఇందులో ఉండ‌నున్నాయ‌ని కంపెనీ పేర్కొంటోంది. మ‌రో విష‌యం ఏమిటంటే ఈ ఈవీ 17 kWh బ్యాటరీ ప్యాక్‌తో వ‌స్తుండ‌డం గ‌మనార్హం.

ఏకంగా 312 కిలోమీట‌ర్లు..

టాటా నానో ఈవీ కార్ (TATA NANO EV CAR) మైలేజీపై మార్కెట్‌లో కొత్త చ‌ర్చ‌కు దారితీసింది. ఈ కారు ఏకంగా 312 కిలోమీట‌ర్లు వ‌స్తోంద‌ని కంపెనీ చెబుతుండ‌డంతో దేశ వ్యాప్తంగా ఆస్త‌కి నెల‌కొంది. సింగిల్ చార్జ్‌పై 312 కిలోమీట‌ర్ల రేంజ్ ఇచ్చే అవ‌కాశం కంపెనీ వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. కంపెనీ అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. ఇది గ‌రిష్టంగా గంటకు 80 వేగంతో వెళ్తుంద‌ని, 10 సెకన్లలోనే 0-100 వేగాన్ని అందుకేనే ఫీచ‌ర్లు ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. బ్యాట‌రీని ఒక్క‌సారి పూర్తి ఛార్జ్ చేయడానికి కేవ‌లం 6 గంట‌ల నుంచి 8 గంటల సమయం ప‌ట్ట‌వ‌చ్చ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అది ఏ మేర‌కు నిజ‌మో కారు బ‌య‌ట‌కు వ‌చ్చాకే తెలుస్తుంది. ఇంటీరియర్ స్పేస్ కూడా కాస్త ఎక్కువగానే ఉండ‌నుంది. సుల‌భంగా నలుగురు కూర్చునేలా ఇంటీరియర్ డిజైన్ చేశారు. బ్యాటరీతో పాటు రెండు ఛార్జింగ్ ఎంపికల్లో అందుబాటులో ఉండ‌నుంది. 15A సామర్థ్యంతో ఒక హోమ్ ఛార్జర్,అలాగే మ‌రో DC ఫాస్ట్ చార్జ‌ర్ కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. టాటా నానో ఈవీ కాంపాక్ట్ కారు సుమారు 3,164ఎమ్ఎమ్ పొడవుతో, వెడల్పు1,750ఎమ్ఎం తో , 2,230 ఎంఎంతో వీల్ బేస్, 180ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంద‌ని కంపెనీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

 

–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్‌ చేసి చదవండి–

కుల గ‌ణ‌న‌ షురూ.. కానీ..

స‌ర్వే డేటా భ‌ద్ర‌మేనా.. ప్ర‌జ‌లకు అనుమానాలు.. ముప్పు ఇదేనా..

వాటిని.. డ్రీమ్ గ‌ర్ల్ హేమామాలిని బుగ్గ‌లుగా మారుస్తా..

ఒలింపిక్ కు ఇండియా స‌న్నాహాలు

వంద రేప్‌లు చేశాడు.. వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు..

టీడీపీ- జ‌న‌సేన మ‌ధ్య ముదిరిన వార్‌

మ‌న మెద‌డు పెరుగుతోంది.. లాభ‌మా .. న‌ష్ట‌మా..

తెలుగు వారిని అంత మాటంటావా.. న‌టి కస్తూరిపై ఫైర్‌

మ‌బ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచార‌ణం

ఇంటింటి స‌ర్వే డేటా భ‌ద్ర‌మేనా.. అసాంఘిక శ‌క్తుల చేతిలోకి వెళ్తే..

కేదార్‌నాథ్ ఆల‌యం మూసివేత‌..ఎప్పుడు.. ఎందుకంటే..

విస్త‌రిస్తున్న షుగ‌ర్ డాడీ.. ఆ ప‌నికోస‌మేనా..

మహేష్‌ బాబు కోసం రాజమౌళి వెతుకులాట

రికార్డు సృష్టించిన అయోధ్య

న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్‌

దొరికిన కుంభకర్ణుడి ఖడ్గం

రామగుండం కొత్త చరిత్ర

బీజేపీలో ముస‌లం.. నెక్ట్స్ బాస్ ఎవ‌రంటే..?

మెడిక‌ల్ వార్‌: ఆయుర్వేదం వ‌ర్సెస్ అలోప‌తి

ప‌డిపోతున్న ఇండియా గ్రాఫ్‌.. కానీ..

One thought on “ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే 312 కి.మీ. ఇక బైక్‌ల‌తో ప‌నేంటి.. టాటా వండ‌ర్‌”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *