Warangal Nit: వరంగల్ నిట్ క్యాంపస్‌లో సాంతికేతిక పండుగ అట్టహాసంగా ఆరంభమైంది. ప్రతీ ఏడాది నిర్వహించే టెక్నోజియాన్ సంవత్సరంగా వేడుకగా శుక్రవారం (నవంబరు8)ఆరంభించారు. రెండు రోజుల పండుగ నేపథ్యంలో వరంగల్ నిట్ క్యాంపస్‌లో కోలాహలం నెలకొంది. టెక్నోజియాన్ నేపథ్యంలో వినూత్న సాంస్కృతిక వేడుకలు అలరించాయి. వేడుకల్లో జాతీయ, అంతర్జాతీయ కళాకారులు తమ కళా ప్రదర్శనలతో ఉర్రూతలూగించారు. రెండురోజుల టెక్నోజియాన్‌లో భాగంగా ఈ రెండు వేడుకల్లో భాగంగా సుమారు 50 ఈవెంట్లను వివిధ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. ఈసారి సాంకేతిక ఈవెంట్ల అలరించనున్నాయని నిట్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. వరంగల్ నిట్‌లో టెక్నోజియాన్, స్ర్పింగ్ స్ర్పీ (వసంతోత్సవం) వంటి వేడుకల్ని నిర్వహస్తున్న విషయం తెలిసిందే.
టెక్నోజియాన్ తొలిరోజు (శనివారం) ఈవెంట్లు,
లెట్ థెమ్ కుక్, బ్రిడ్జి ప్రైమ్‌వేర వర్క్‌షాప్ సికాడ, కేబీసీ, ల్యాబ్రింత్ సర్క్యూట్ చేస్, కెమ్ ఫ్యాబ్రికో, ఎక్స్‌పో ఎగ్జిబిషన్, పీఎం సైన్స్ క్విజ్, కెమ్ ఈ కేస్ బిల్డ్ ఏ పీసీ, రిసర్చ్ పేపర్ ప్రజంటేషన్, ఎల్‌ఎల్‌డి, మెకానికల్ కిట్ అసెంబ్లీ, వెహికిల్ డెమోన్‌స్ట్రేషన్, డేర్ టూ ఫీల్ ద పేయిన్, ఫైండ్ ద స్కామ్, డచ్ యాక్షన్, థ్రస్ట్ ఆఫ్, ట్రెజర్ హంట్ క్యాంపస్ ఇన్నోవ్ 8, ఐడీయాతన్, ఫారెస్సిక్ ఇన్వెస్టిగేషన్, మెట్ రష్, మెటాఫోర్జ్ మిస్టరీ మేజ్, టక్నో హంట్, ఫ్యూచర్ మేనేజర్, డిబగ్గర్స్ డ్యుయేల్, డాటా సైన్స్‌సెంటర్, ఉన్నాయి. ఫోటోగ్రఫీ క్లబ్, క్విజ్ క్లబ్, ఈఏ అండ్ ఎహ్‌ఏఎంఎం, సీఎస్‌ఈఎస్, కమిస్ట్రీ సొసైటీ, ఫిజిక్స్ సొసైటీ, ఈసీఈ సొసైటీ, రోబోటిక్ క్లబ్, మెకానికల్ ఇంజనీరింగ్ సొసైటీ, ఈఈఈ సొసైటీ, సైన్‌్స్ అండ్ అస్ట్రానమి క్లబ్ వాల్యు ఎడ్యుకేషన్ క్లబ్ ఈవెంట్లు
మెరిసిపోతున్న నిట్
టెక్నోజియాన్ పురస్కరించుకుని నిట్ క్యాంపస్‌ను విద్యుత్ వెలుగుల్లో ధగధగలాడుతోంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే విద్యార్ధుల కోసం ప్రత్యేక వంటతో ఘుమగుమలాడుతున్నాయి. వారికికోసం స్పెషల్ వంటకాలను రెడీ చేశారు. నిట్‌లో ఫుడ్ కోర్టులు నోరూరించే వంకాలను అందిస్తున్నాయి. స్పాన్సర్ల ఫ్లెక్సీలు సందడిగా మారాయి.
వేడుకల్ని ఆరంభించిన శాస్త్రవేత్త ఎన్‌వీ చౌదరి
కాగా నిట్‌లో జరిగే టెక్నోజియన్ –24 వేడుకలను హైదరాబాద్ సీఎస్‌ఐఆర్–ఐఐసీటీ విశిష్ట శాస్త్రవేత్త డాక్టర్ ఎన్‌వి చౌదరి శుక్రవారం ప్రారంభించారు. అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్‌లో జరిగిన ప్రారంభ వేడుకలను జ్యోతి ప్రజ్వలన అట్టహాసంగా ప్రారంభించారు. సాంకేతిక రంగంలో అందివచ్చిన ప్రతీ అంశాన్ని విద్యార్థులు అందుపుచ్చుకోవాలని చౌదరి సూచించారు.