NIT: వరంగల్ నిట్(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) సాంస్కృతిక సంబరాలతో అదిరిపోయింది. మూడు రోజుల పాటు సాగే స్ర్పింగ్ స్ర్పీ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు(శుక్రవారం) టెక్నోక్రాట్స్ అలరించాయి. భావిభారత ఇంజనీర్లు తమ సృజనాత్మక, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉర్రూతలూగించారు. వేడుకల్ని శుక్రవారం నిట్‌లోSPRING SPREE –2024ను నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుద్ధి అట్టహాసంగా ప్రారంభించారు. నిట్‌లోని ఏక్ భారత్ శ్రేష్ట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నృత్యం, ప్రముఖ కూచిపూడి నర్తకి తాడూరి రేణుక తన శిష్య బృందంతో కూచిపూడి నృత్యాలను వహ్వా అనిపించాయి. ఆరోహన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నుక్కడ్ నాటక్ అనే నృత్య ప్రదర్శన వీక్షకుల మదిని కట్టిపడేసింది. వివిధ రకాల రుగ్మతలపై సమాజం స్పందించాల్సిన తీరును అద్భుతంగా ప్రదర్శించారు. నిట్‌లోని లిటరసీ అండ్ డిబేట్ క్లబ్ ఆధ్వర్యంలో అన్ సాల్వ్డ్ పేరుతో నిర్వహించిన ఆట వినూత్నంగా సాగింది. ఆరుగురు అనుమానితుల నుంచి హంతకులను గుర్తించడం లక్ష్యంగా ఆట సాగడం.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అనుమానితుల గుర్తించడం ఈ ఆట ప్రధాన ఉద్దేశం నిట్‌లోని యూత్ రెడ్ క్రాస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాలో వివిధ రకాలైన క్రీడలు నిర్వహిస్తారు. ఆసక్తిగల వారు మేళాలో నిర్వహించే అన్ని రకాల క్రీడల్లో ప్రతిభ కనబర్చాలి. యానిమీ అండ్ కామిక్ క్లబ్ ఆధ్వర్యంలో యానిమీ షోలు ప్రదర్శించారు. థియేటర్లో పలు యానిమి షోలు ప్రదర్శించారు. నిట్ మ్యూజిక్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరౌకే టెక్నోక్రాట్లకు కిర్రాక్ లేపింది. లాలాగే ఆరోహన్ క్లబ్ ఆధ్వర్యంలో డ్రామా కాంపిటేషన్‌తో పాటు డ్రామా యాక్షన్ సన్నివేశాలను ఆవిష్కరించారు. నిట్ ఫిల్మ్ అండ్ మ్యూజిక్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాఫిక్ డిజైన్‌పై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఛాయ్ బిస్కెట్ సినిమా ఎడిటర్ డ్రాంప్ కిరణ్ పాల్గొని విద్యార్థులకు మెళకువలు నేర్పించారు. అలాగే డ్యాన్స్ అండ్ డ్రమెటిక్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోర్ రీల్ రెవ్లట్లో ఆన్లైన్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని విద్యార్థులు చేసిన రీల్స్‌ను ప్రదర్శించారు.
సౌత్ ఇండియాలో ప్రముఖ సింగర్‌గా వెలుగొందుతున్న హరిచరణ్ బ్యాండ్ షోతో ఉత్సాహాన్ని నింపి ఉరకలెత్తించారు. ఇది కదా కల్చరల్ ఫెస్ట్ అన్న చందంగా హరిచరణ్ బ్యాండ్ షో అదిరింది. ప్రముఖ సింగర్ శిరిష తన గానంతో ఉర్రూతలూగించారు.
వరంగల్ నిట్(NIT) (స్ర్పింగ్ స్ర్పీ–2024) వేడుకల్లో భాగంగా 40 ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన సుమారు పది వేల మంది విద్యార్ధులు పాల్గొంటున్నారు. 50కిపైగా ఈవెంట్లను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. సరికొత్త ఈవెంట్లను ఈసారి ప్రవేశపెట్టారు. వినోదంతో కలిసిన విజ్ఞానం లక్ష్యంగా ఈవెంట్లను రూపొందించారు. నిట్స్ గాట్ టాలెంట్, నుక్కడ్ నాటక్,కరోకే రూం, రీల్ రెనాల్ట్, నాటక పోటీలు, వీడియో ఎడిటింగ్ వర్క్‌షాపు, ఫోటో హంట్, ఆన్సాల్వ్డ్, కూచిపూడి నాట్యకళ, అనిమా మ్యూజియం, నటన, గ్రాఫిక్ డిజైన్, ఫుడ్ హంట్, మేళ, ఫిల్మ్ ట్రెజర్ హంట్, ఫిల్మ్ క్విజ్ తదితర అంశాల లో ఈ జరగనున్నాయి.
ఎక్కువ వంది చదివినవిః
కేజ్రివాల్‌పై అవినీతి మరక..
బీజేపీ 400 ఎంసీ సీట్లు సాధిస్తుందా..
వంద రోజులో బీఆర్ ఎస్ సీన్ రివర్్స
అబ్బుర పరిచే వేయిస్తంభాల గుడి