PAVANKALYAN

PAVANKALYAN FIRE:  అల్లు అర్జున్‌పై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేనా అధినేత పవర్‌ పవన్‌ కల్యాణ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్‌ ఘటనపై తొలిసారిగా పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్‌ ఉద్దేశించి వ్యాఖ్యానించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా పవన్‌ మీడియాతో మాట్లాడుతూ సంధ్య థియేటర్‌లో పుష్పా–2 బెనిఫిట్‌ షో నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందినా అప్పుడు బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి పరామర్శిస్తే ఈ సమస్య వచ్చి ఉండేది కాదని అల్లు ఫ్యామిలీ ఉద్దేశించి పేర్కొన్నారు. గోటితో పోయేదానిని గొడ్డలిదాకా తీసుకొచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన మరుసటి రోజు మేము ఉన్నామంటూ భరోసా కల్పిస్తే వివాదం ఈ స్థాయి వరకు వచ్చేది కాదంటూ స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది. పరామర్శ అనేది లోపించిందంటూ అల్లు, సినీ దర్శక, నిర్మాతలను ఉద్దేశించి పవన్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో బన్నీదే తప్పు అంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, గతంలోనూ పవన్‌ పుష్పా సినిమాపై తీవ్ర విమర్శలు చేసిన విషయమూ విదితమే. స్మగ్లర్లు, చెట్లను నరికేవారు హీరోలా ఉంటూ పుష్పా పాత్రను ఉద్దేశించి పరోక్షంగా అల్లు అర్జున్‌ను టార్గెట్‌ చేసి మాట్లాడారు.

మరోసారి తేటతెల్లమైన మెగా వార్‌..

PAVANKALYAN FIRE: మెగా – అల్లు ఫ్యామిలీ మధ్య వైరం మరింత ముదిరినట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల నుంచి రెండు కుటుంబాల వైరం ఇండస్ట్రీలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. పుష్పా–2 తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ జైలుకు వెళ్లగా అతడిని టాలీవుడ్‌ క్యూకట్టి పరామర్శించింది. కానీ, మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, నాగబాబు మాత్రమే పరామర్శించారు. పవన్‌ కల్యాన్‌, రాంచరణ్‌, ఇతర సభ్యులు పట్టించుకోలేదు. తాజాగా సినీ ఇండస్ట్రీపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేయగా, రాజీ మార్గం కోసం సినీ ప్రముఖులంతా ఏకమై సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. అల్లు అర్జున్‌ పుష్పా–2 ఘటన నేపథ్యంలో ఇదంతా జరిగినా.. సీఎంను కలిసేందుకు టాలీవుడ్‌ పెద్దలంతా వెళ్లినా ఇటు మెగాస్టార్‌ చిరంజీవి, రాంచరణ్‌లు మాత్రం వెళ్లకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అల్లు అర్జున్‌కు మద్దతుగా వెళ్లేందుకు ఇష్టం లేకనే వారు వెళ్లలేదని ప్రచారం సాగుతోంది.

PAVANKALYAN FIRE:  జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌కు వచ్చినా బన్నీని పరామర్శించలేదు. కారణం ఏమిటో తెలియదు కానీ, వారి వైరానికి అదో  కారణమని తెలుస్తోంది. ఇదిలాఉంటే తాజాగా పవన్‌ కల్యాణ్‌ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం మరోసారి సంచలనంగా మారింది. మరి వీరి వైర్యం ఎప్పుడు ముగుస్తుందో వేచిచూడాలి.

READ MORE: అల్లు అర్జున్‌ పొలిటికల్‌ ఎంట్రీ?

READ MORE: ఇండస్ట్రీకి తలవంపులు.. తమ్మారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *