మనం సహజంగా తెల్లని, బురద రంగులో నీటిని చూస్తుంటాం. అదే సముద్రంలో అయితే నీలి, ఆకుపచ్చ రంగులో ఉండడం తెలిసిందే. కానీ, పలుచోట్ల గులాబీ రంగులో నీటి సరస్సులు ఉన్నాయి. వినేందుకే ఆశ్చర్యంగా ఉంది కదూ. అవును ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో ఈ పింక్ సరస్సులు వివిధ దేశాల్లో ఉండడం విశేషం.
డర్టీ రోజ్ లేక్..
కెనెడాలోని బ్రిటిష్ కొలంబియాలోని ట్వీడ్స్‌ముయిర్ పార్క్ ప్రాంతంలో ఉంది ఈ పింక్ సరస్సు. సహజంగా సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది. ఈ సరస్సులో ఆ గుణాలు లేకపోవడంతో, ఆక్సిజన్ రహితం కావడంతో పింక్ కలర్‌లో నీరు కనిపిస్తుంది. ఇక్కడి వెళ్లేందుకు రోడ్డు మార్గం మాత్రం లేదు. ఎవరైనా ఈ సరస్సును చూడాలంటే ఆకాశమార్గం ఒక్కటే దిక్క.
హట్ లగూన్ నది. ..
ఇది ఆస్ట్రేలియాలోని మిడ్‌వెస్ట్ ప్రాంతంలో ఉంది. ఇది ఓ ఉప్పునీటి సరస్సు. సముద్ర తీరానికి అనుకుని దిగువన ఉన్న పొడవైన నది ఇది. హిందూ మహాసముద్రం నుంచి సరస్సు వేరుచేయబడి ఉంటుంది. సముద్రపు నీరు ఇందులో కలవదు. కొండ, ఇతర ప్రాంతాల ద్వారా వచ్చిన నీరే సరస్సులో కలుస్తుంది. ఈ ప్రాంతం చిత్తడి నేల కావడంతో వేడి ఎక్కువగా ఉంటుంది. గ్రెగొరీ పట్టణం అటు సముద్రం.. ఇటు పింక్ కలర్ సరస్సు మధ్య ఉండడం విశేషం.
నట్రాన్ సరస్సు…
టంజానియాలోని అరుషా ప్రాంతంలో ఉంది నట్రాన్ సరస్సు. ఇది తూర్పు ఆఫ్రికాలో ఉంది. అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన రామ్‌సర్ సైట్ చిత్తడి బేసిన్‌లో ఈ పింక్ నది ఉంది. దక్షిణ ఎవాసో ఎన్‌గిరో నది ద్వారా ప్రవహిస్తూ, కేన్యా ప్రాంతంలో నది పెద్దదిగా మారుతుంది. ఖనిజ సంపద అధికంగా ఉండడమేకాదు, వేడి నీటిబుగ్గలు ఉండడం విశేషం.
మహార్లూ సరస్సు..
ఇది ఇరాన్‌లోని షిరాజ్ ఎత్తైన ప్రాంతంలో ఉన్న సహజసిద్ధమైన ఉప్పునీటి సరస్సు ఉంది. ఇందులో పొటాషియం ఇతర ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. ఉప్పు సాంద్రత కారణంగా సరస్సు లోపలి ఎర్రటి ఆటుపోట్ల ఫలితంగా నీరు గులాబీ రంగులోకి మారుతుంటుంది.
మసాజిర్‌గోల్ …
అజర్‌బైజాన్ కాపిటల్ సిటీలోని అబ్‌షెరాన్ ద్వీకల్పం ఖరాదాగ్‌రేయాన్‌లో ఉంది ఈ మసాజిర్‌గోల్ ఉప్పునీటి సరస్సు. కాస్పియర్ సముద్రం పశ్చిమ తీరంలో ఈ సదస్సు ఉంది. ఇక్కడి పెద్ద ఎత్తను ఉప్పును తయారు చేస్తుంటారు.
[…] 2. మిస్టరీగా మారిన నదులు […]