pm-vidyalaxmi: కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ఉన్నత చదువుల కోసం తాజాగా కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ప్రతిభ ఉండీ ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరయ్యే వారికి ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలాంటి వారికి ఉన్నత చదువును అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టుంది. అదే ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి. ఇటీవల మంత్రి వర్గం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం విశేషం. దాంతో శరవేగంగా పథకం అమలుకు అడుగులు పడుతున్నాయి. అది అమల్లోకి వస్తే పేద విద్యార్థులకు వరంలా మారనుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
భారత దేశంలో 860 ‘నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థ (క్యూహెచ్ఈఐ)’లు ఉన్నాయి. అందులో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఎలాంటి షరతులు, హామీలు లేకుండానే పీఎం–విద్యాలక్ష్మి పథకం అమలు చేయనున్నారు. ఫలితంగా వారు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కావాల్సిన రుణాలు ఈ పథకం కింద అమలు చేస్తాయి. అంతేకాదు ట్యూషన్ ఫీజు, ఇతర విద్యా ఖర్చుల కోసం రుణాలను
విద్యార్థులు ఈ పథకం కింద వినియోగించుకోవచ్చు.
రూ.3600 కోట్లు కేటాయింపు..
పీఎం–విద్యాలక్ష్మి పథకం(pm-vidyalaxmi) కోసం కేంద్రం రూ.3600 కోట్లు కేటాయించేందుకు సమాయత్తమైంది. 22 లక్షల మంది విద్యార్థులు ఏటా స్కీం పరిధిలోకి వస్తారన్నారు. ‘జాతీయ ర్యాంకింగ్ విధివిధానాల సంస్థ (ఎన్ఐఆర్ ఎఫ్) ఇచ్చే ర్యాంకులను ఆధారం చేసుకుని క్యూహెచ్ఈఐల జాబితాను సంబంధిత అధికారులు రూపొందిస్తారు. ఆ ర్యాంకుల ప్రమాణికంగానే ఈ జాబితాను ప్రతీ సంవత్సరం ఉన్నతీకరిస్తారు (అప్డేట్). 860 క్యూహెచ్ఈఐల్లో ప్రస్తుతం ఈ పథకాన్ని అమలు చేసే యోచనల కేంద్రసర్కారు ఉంది. క్యూహెచ్ఈఐల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా రూ.7.50 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. అందులో 75 శాతం కేంద్ర ప్రభుత్వమే బ్యాంకులకు గ్యారెంటీ ఇస్తుంది. విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్లు ఇవ్వడానికి బ్యాంకులకు మద్దతుగా నిలవనుంది.
అర్హులు.. షరతులు..
పీఎం–విద్యాలక్ష్మి పథకం కింద విద్యార్థుల ఎంపిక కేంద్ర కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.
వార్షిక ఆదాయం రూ.8 లక్షల్లోపు ఉన్న కుటుంబాల్లోని విద్యార్థులకు ఈ పథకాన్ని అర్హత సాధిస్తారు.
వడ్డీ రాయితీ, ప్రభుత్వ స్కాలర్ షిప్‌లు పొందుతున్నవారు ఈ స్కీంకు అనర్హులు. ప్రతీ సంవత్సరం ఏటా లక్ష మంది విద్యార్థులకు వడ్డీ రాయితీ కింద ఈ ఆర్థిక సాయం అందించనుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులకు ఈ స్కింకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వడ్డీ ఉన్నత విద్యా శాఖ రూపొందించిన ‘పీఎం–విద్యాలక్ష్మి’ పోర్టల్‌లో పథకాల కోసం రుణాలు, వడ్డీ రాయితీకి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్ చేసి చదవండి–
అదృశ్యమైన నటి.. తెలుగువారిని అవమానించినందుకే..
తెలుగు వారిని అంత మాటంటావా.. నటి కస్తూరిపై ఫైర్
మిస్త్ ఎర్త్ 2024 విజేతగా జెస్సికా లేన్
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
విషాదంలో సినీ ఇండస్ట్రీ.. ప్రముఖ నటుడు కన్నుమూత
వంద రేప్‌లు చేశాడు.. వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు..
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
నేడే బిగ్ ఫైల్.. ఇండియ బిగ్ ప్లాన్.. సౌతాఫ్రికాతో రెండో టీ20..
ఎలాన్ ముస్క్ కు ట్రంప్ బిగ్ ఆఫర్..
వాటిని.. డ్రీమ్ గర్ల్ హేమామాలిని బుగ్గలుగా మారుస్తా..
టీడీపీ- జనసేన మధ్య ముదిరిన వార్
మన మెదడు పెరుగుతోంది.. లాభమా .. నష్టమా..
కేదార్నాథ్ ఆలయం మూసివేత..ఎప్పుడు.. ఎందుకంటే..