కొత్త చరిత్రకు పెద్దపల్లి జిల్లా రామగుండం ముస్తాబుతోంది. దేశంలోనే అతిపెద్ద సోలార్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవానికి రెడీ అయింది. సుమారు రూ.800కోట్లలో 176 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ లక్ష్యంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఎల్‌అండ్‌టీ సంస్థ దీని కాంట్రాక్టు పొంది పనులు పూర్తి చేసింది. ఎన్టీపీసీ రామగుండం రిజర్వాయర్‌లో వంద మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌, పది మెగావాట్ల గ్రౌండ్‌మౌంట్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌ను ఇప్పటికే నిర్మించారు. తర్వాత ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీపై దృష్టి సారించింది. సోలార్‌ ఉత్పత్తి పెంపుపై కసరత్తు చేసింది. ఇందులో భాగంగా సోలార్‌ ప్లాంట్‌ను విస్తరించింది. కొత్తగా 56 మెగావాట్ల ఫ్లోటింగ్‌, 120మెగావాట్ల గ్రౌండ్‌ మౌంట్‌ సోలార్‌ ప్రాజెక్టు నిర్మించేందుకు పూనుకుంది. అదే లక్ష్యంతో నిర్మాణ పనులను పూర్తి చేసింది. తాజా ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే రామగుండం నుంచి మొత్తం 286 మెగావాట్ల సౌర వెలుగులు పొందనున్నారు. దీంతో దేశంలోనే అతిపెద్ద సౌర విద్యుత్‌ కేంద్రంగా రామగుండం అవతరించనుంది. సౌర ప్లాంట్‌ను ఈనెలలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈమేరకు ఎన్టీపీసీ తగిన ఏర్పాట్లు చేస్తోంది.

తొలివిడ‌తలో తెలంగాణలోని రామగుండంలో వంద మెగావాట్ల రామగుండం ఫ్లోటింగ్ సోలార్ పీవీ ప్రాజెక్ట్‌లో 20 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్ప‌త్తికి ఎన్టీపీసీ అందుబాటులోకి తెచ్చింది. 2022 జూలై 1 ఈ ప్లాంట్ అందుబాటులోకి రావ‌డంతో 120మెగావాట్ల విద్యుత్‌ను అందించి చ‌రిత్ర సృష్టించింది. రూ.423 కోట్లతో రిజర్వాయర్‌లో 500 ఎకరాల్లో సోలార్ ప‌రిక‌రాల‌ను అమ‌ర్చారు. మొత్తం 40 బ్లాకులుగా విభజించి విద్యుత్ ఉత్ప‌త్తి చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు దక్షిణ భార‌తంలో ఫ్లోటింగ్ సోలార్ కెపాసిటీ మొత్తం 217 మెగావాట్లు కాగా, కేర‌ళ రాష్ట్రంలోన కాయంకుళం లో 92 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఉత్ప‌త్తి అవుతోంది. అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్‌లోని సింహాద్రి వద్ద మ‌రో 25 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ వెలుగులు అందిస్తున్నాయి.

పర్యావరణ దృక్కోణం నుండి, అత్యంత స్పష్టమైన ప్రయోజనం ఏమిటంటే, సంబంధిత తరలింపు ఏర్పాట్లకు కనీస భూమి అవసరం. ఇంకా, తేలియాడే సౌర ఫలకాల ఉనికితో, నీటి వనరుల నుండి బాష్పీభవన రేటు తగ్గుతుంది, తద్వారా నీటి సంరక్షణలో సహాయపడుతుంది. సంవత్సరానికి సుమారు 32.5 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి ఆవిరిని నివారించవచ్చు. సౌర మాడ్యూల్స్ కింద ఉన్న నీటి శరీరం వాటి పరిసర ఉష్ణోగ్రతను నిర్వహించడంలో సహాయపడుతుంది, తద్వారా వాటి సామర్థ్యాన్ని మరియు ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా, సంవత్సరానికి 1,65,000 టన్నుల బొగ్గు వినియోగాన్ని నివారించవచ్చు; సంవత్సరానికి 2,10,000 టన్నుల Co2 ఉద్గారాలను నివారించవచ్చు.

2 thought on “చ‌రిత్ర సృష్టిస్తున్న రామ‌గుండం..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *