NOIDA: వ్యపారాన్ని వృద్ధి చేసుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా వినియోగదారులను ఆకర్శిస్తుంటారు. కొందరు వన్ ప్లస్ వన్ అంటూ ఆఫర్లు పెడితే.. ఇంకొందరు బంపర్ డ్రాలు పెడుతుంటారు. వీటన్నింటికి భిన్నంగా ఓ రియల్ ఎస్టేట్ వ్యపారి వినూత్న ఆఫర్ పెట్టాడు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నోయిడాకు చెందిన ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేమిటంటే తమ లగ్జరీ విల్లాలను కొనుగోలు చేసిన వారికి ఇటలీకి చెందిన సూపర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆటోమోబిలి లాంబోర్గిని కారును బహుమానంగా ఇస్తామని సదరు సంస్థ ప్రకటించింది.
నోయిడా(NOIDA)కు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ జేపీ గ్రీన్స్ గ్రేటర్ నోయిడాలో 6-బిహెచ్, 5 -బిహెచ్, 4- బిహెచ్, 3- బిహెచ్ తోపాటే పలు విల్లాలను ఆ సంస్థ నిర్మించింది. అయితే వీటి ధరలు రూ.51 లక్షల నుంచి ఏకంగా రూ.30 కోట్ల వరకూ ఆయా విల్లాల ధరల్ని నిర్ణయించింది. ఖరీదైన విల్లాలను విక్రయించేందుకు సదరు సంస్థ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ బంపర్ ఆఫర్‌ను ప్రకటించినట్టు తెలిసింది. ఈ మేరకు రియల్టర్ తమ సంస్థ నిర్మించిన అల్ట్రా ప్రీమియం విల్లాలను కొన్న వారికి సోషల్ మీడియా వేదికగా ఈ అద్భుత ఆఫర్‌ను ప్రకటించింది. అయితే రూ.4 కోట్ల కంటే ఎక్కువ విలువైన కాంప్లిమెంటరీ లాంబోర్గినీ ఉరస్ ఉచితంగా పొందాలంటే తమ సంస్థలోన రూ.రూ.26 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన విల్లాను కొనుగోలు చేయాలని మెలిక పెట్టింది. సదరు కారు కావాలి అనుకునేవారు.. విల్లాను కొనుక్కోవడమే. కానీ షరతులు వర్తిస్తాయి.
తాజా వార్తలకు ఇవి క్లిక్ చేయండి వెతుకులాట
3. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి..