SANDHYA THEATER SHOWCASE NOTES : హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నగర పోలీసుల కమిషనర్ సీవీ ఆనంద్ తాజాగా సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మహిళ మృతికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని, ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివారణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పది రోజుల్లో పూర్తి వివరణ పంపాలంటూ స్పష్టం చేశారు. పుష్పా–2 ప్రీమియర్ షో ఈనెల 4న జరిగిన విషయం తెలిసిందే. సాయంత్రం సినీ హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్‌కు రాగా అప్పటికే పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. పుష్పా–2 సినిమా ప్రీమియర్ షోకు హీరో, హీరోయిన్లు వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని, వారిని రాకుండా చూడాలని సంధ్య థియేటర్ యాజమాన్యానికి నాడు చిక్కడపల్లి పోలీసులు సూచించారు. అయినా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో తొక్కిసలాట జరిగి మహిళ మృతికి కారణమైందని, ఈ విషయంలో థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ సీపీ సదరు షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. ఈ విషయంపై పదిరోజుల్లో వివరణ ఇవ్వాలంటూ హెచ్చరించారు. థియేటర్ సమీపంలో రెస్టారెంట్లు, రద్దీగా ఉండే ఈప్రాంతంలో సినీ హీరో, హీరోయిన్లు వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పినా ఎందుకు పట్టించుకోలేని సీపీ అందులో పేర్కొన్నట్టు తెలిసింది. ఇది చాలదన్నట్టు అల్లు అర్జున్ ఓపెన్ టాప్ వాహనంలో అభివాదం చేసుకుంటూ రావడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు ఆయన భావిస్తున్నారు.
శ్రీతేజకు సర్కారు వైద్యం…
SANDHYA THEATER SHOWCASE NOTES : సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతిచెందగా తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ప్రభుత్వం తరపున సీపీ ఆనందం, ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్‌లు కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కాగా, శ్రీతేజ కు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్‌యూనిట్ (ఐసీయూ)లో వెంటిలేటర్ సాయంతో చికత్స పొందుతున్నారు. శ్రీతేజ అడపాదడపా జ్వరం వస్తుండగా ఇప్పడు తగ్గిందని కిమ్స్ కడల్స్ ఆస్పత్రి వైద్యులు మంగళవారం సాయంత్రం హెల్త్‌లో పేర్కొన్నారు.
పలువురి అరెస్టు..
SANDHYA THEATER SHOWCASE NOTES : సంధ్య థియేటర్‌లో ఈనెల4న జరిగిన తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే పోలీసులు పది మందిని అరెస్టు చేశారు. మరోఆరుగురు పరారీలో ఉన్నట్టు చిక్కడపల్లి పోలీసులు పేర్కొన్నారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.
READ MORE: భారత్‌కు సొంత స్పేస్ స్టేషన్
READ MORE: చలో శుక్రయాన్ !