SILKSMITHA: సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా మరో సినిమా రాబోబోంది. ఇప్పటికే విద్యాబాలన్‌ సిల్క్‌స్మిత పాత్ర పోషించిన ది డర్టీ పిక్చర్‌ బ్లాక్‌ బ్లాస్టర్‌ అయిన విషయం తెలిసిందే. సిల్క్‌స్మిత– ది క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ పేరుతో సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సిల్క్‌స్మిత జయంతి(డిసెంబరు–2) సందర్భంగా మూవీ మేకర్స్‌ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఏకకాలంలో అన్ని భాషల్లో సినిమా విడుదల చేసేందుకు మూవీ మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. సిల్క్‌స్మిత పాత్రలో చంద్రికారవి నటించనుంది. సిల్క్‌స్మిత మూవీని నూతన దర్శకుడు జయరాయ్‌ తెరకెక్కిస్తున్నారు. నిర్మాత ఎస్‌బీ అమీర్తరాజ్‌ సిరి సినిమా బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ మేరకు బ్లింప్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చేస్తోంది. 3.10 నిమిషాల వీడియో చూస్తే సినిమాను హాట్‌హాట్‌గానే ఉండోబోతోందని తెలుస్తోంది.

READ MORE:  ఎవ‌రీ అక్కినేని కోడ‌లు.. జైనాబ్ గురించి తెలుసా..

ఈ వీడియోలో సిల్క్‌స్మిత ప్రాతలో నటిస్తున్న చంద్రికారవిని చాలా హాట్‌గా చూపించారు. అంతేకాదు, దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని పోలిన పాత్ర ఆసక్తిరేపుతోంది. ఆమె తన చైర్‌ కూర్చోని అన్ని పేపర్లు తిరగేస్తుండగా అన్నింట్లో సిల్క్‌స్మిత ఫొటోలు పబ్లిక్‌కావండంతో ఆశ్చర్యపోతోంది. ఆమె ఎవరనీ ప్రశ్నించగా, అతడి అసిస్టెంట్‌ మీరు ఐరన్‌ లేడీ ఆమె మాగ్నటిక్‌ లేడీ అంటూ సంబోధించడం సిల్క్‌స్మిత ప్రాతను రివిల్‌ చేయడం సినిమా ఆసక్తి పెంచుతోంది. సిల్క్‌స్మిత జయంతి సందర్భంగా ఈ గ్లింప్స్‌ విడుదల చేయగా, త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు మేకర్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సిల్క్‌స్మిత తన కెరీర్‌లో 450 సినిమాల్లో నటించింది. 17ఏళ్లు ఇండస్త్రీలో.. ఐదు భాషల్లో నటించింది.

ఎవ‌రీ సిల్క్‌స్మిత

డిసెంబరు 2, 1960 జ‌న్మించారు. సిల్క్‌స్మిత(SILKSMITHA) అస‌లు పేరు విజయలక్ష్మి. ఈమె తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషలలో 200లకు పైగా సినిమాలలో నటించింది. ఈమె అధికంగా గ్లామర్‌, ఐటెం సాంగ్‌లో న‌టించింది. ఆంధ్ర ప్ర‌దేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో కొవ్వలిలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించింది. 4వ తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పింది. సినీనటి కావాలనే ఆకాంక్షతో మద్రాసు చేరుకుంది. వెండితెర‌పై సిల్క్‌స్మిత పేరుతో కొన‌సాగింది. వెండి తెర‌పై స్మిత పేరుతో మొదటి చిత్రం తమిళంలో వండి చక్రం (బండి చక్రం) 1979లో విడుద‌లైంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్, ఈ సినిమాతో మంచి పేరురావ‌డంతో సిల్క్ స్మిత గా మార్చుకుంది. కాగా, సెప్టెంబరు 23, 1996లో మ‌ర‌ణించింది.

READ MORE:  మరోసారి రెచ్చిపోయిన సమంత..

SILKSMITHA: సిల్క్ స్మిత అవివాహిత. 1996, సెప్టెంబరు 23 న మద్రాసులోని తన నివాస గృహంలో మరణించి ఉంది. అంతకు ముందు ఆమె ప్రేమ వ్యవహారాలు విఫలమైనట్లూ, చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెద్దపెట్టున నష్టాల పాలైనట్లు వార్తలు వచ్చాయి. వాటికి తోడు మద్యపానం కూడా ఆమెను నిసృహలోకి నెట్టివేసిఉండవచ్చునని అందువల్లనే ఆమె ఆత్మహత్య చేసుకొన్నదని భావిస్తున్నారు.

 

One thought on “SILKSMITHA: మ‌ళ్లీ రాబోతున్న సిల్క్‌స్మిత”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *