Sim scam/ అలెర్ట్‌.. అలెర్ట్‌.. మీరు విచ్చలవిడిగా మొబైల్‌ సిమ్‌ కార్డులు వాడుతున్నారా.. మీరు గతంలో వాడిన సిమ్‌ కార్డులు ప్రస్తుతం వినియోగంలో లేవా.. మీరు ఇంతకు ముందు వాడిన నంబరు ఏమైందో తెలియడం లేదా.. అసలు మీకు తెలియకుండా మీ నంబరును

మీద ఎంత మంది వాడుతున్నారా.ఓ.అయితే మీరు వెంటనే అప్రమత్తం కావాల్సిందే. సిమ్‌ కార్డుల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవాల్సిందే. లేదంటే సంఘ విద్రోహ శక్తుల ఉచ్చులో పడినట్టే.. ఆన్‌లైన్‌ మోసగాళ్ల యాయలో చిక్కుకున్నట్టే.. అందుకే భారతీయ టెలికం రంగం అధికారులు జాగరూకతతో ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇంకా నిర్లక్ష్యం వహిస్తే జరిగే అనర్థాలు ఎన్నో.. వాటి బయట పడాలనుకునే వారి కోసంమే కథనం.

 

వాడని సిమ్‌లు ఏమౌతున్నాయి..

ఇప్పుడున్న మొబైల్‌ ఫోన్లన్నీ డ్యూయల్‌(రెండు) సిమ్‌లు ఉన్నవే. ఆండ్రాయిడ్‌ విప్లవం వచ్చాక చాలామంది రెండు సిమ్‌లను వాడుతున్నారు. చాలామంది కొంత కాలం రెండేసి సిమ్‌లు వాడి ఆ తర్వాత సింగిల్‌ సిమ్‌ వాడుతున్నారు. పదేళ్లు వెనక్కి వెళితే.. టెలికాం రంగంలో చాలా కంపెనీలు ఉండేవి. టెలీనార్‌, ఐడియా, వొడా, ఎయిర్‌ టెల్‌, రిలయన్స్‌, జీయో.. ఇలా ప్రైవేటు కంపెనీలు సిమ్‌ కార్డులను విక్రయించేయి. ఈ సిమ్‌లను కొందరు నెట్‌ కోసం ఒకటి, ఔట్‌ గోయింగ్‌ కోసం మరొకటి, ఇన్‌కమింగ్‌ కోసం ఇంకోటి ఇలా వారివారి అవసరాన్ని బట్టి వాడేవారు. ఇప్పుడు ఎక్కువగా జియో, ఎయిర్‌ టెల్‌ వాడుతుండడంతో పాత సిమ్‌లు బ్లాక్‌ అయ్యాయి. వినియోగదారులు కూడా నంబర్‌ కట్‌ కావడంతో ఇక అంతా సుఖాంతం అనుకుంటున్నారు. కానీ ఇక్కడే సంఘ విద్రోహ శక్తులు తమకు అనువుగా మార్చుకుంటున్నాయి.

 

ఆధార్‌తో సిమ్‌ల వల..

మనలో చాలా మంది వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు.. ఇతర ఐడెంటిటీ కోసం ఎక్కువగా ఆధార్‌ నంబరు ఇస్తుంటారు. మనం జిరాక్స్‌ కాపీనే ఇస్తున్నా.. కొన్ని ప్రైవేటు కంపెనీలు వాటిని ఇష్టారాజ్యంగా వాడుతున్నాయి. గోప్యంగా ఉంచాల్సిన ప్రైవేటు సంస్థలు ఆధార్‌ నంబర్లను డబ్బుల కోసం విక్రయిస్తున్నాయి. ఇదే అదునుగా భావించి ఆన్‌లైన్‌ మోసగాళ్లు, సంఘ విద్రోహ శక్తులు మీ ఆధార్‌ నంబరుతో సిమ్‌లను వాడి మోసాలకు పాల్పడుతున్నారు. ఏదైనా ఘోరం జరిగితే ముందుకు జైలుపాలయ్యేది సదరు ఆధార్‌ నంబరు కలిగిన వారేనని వేరే చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తుంది.

 

మీ పేరుపై ఎన్ని సిమ్‌లు ఉన్నాయో ఇలా తెలుసుకోండి..

మొబైల్‌ సిమ్‌ కార్డులు వినయోగించేవారు మీ పేరు మీదు ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. టెలికం రంగంలో వస్తున్న మోసాలను అరికట్టి.. వినియోగదారులను రక్షించడమే దీని ముఖ్య ఉద్దేశం. మీ పేరు మీదు ఏఏ సిమ్‌లు వినియోగంలో ఉన్నాయో తెలుసుకుని.. మీరు వాడని నంబరును వెంటనే బ్లాక్‌ చేసుకుని సురక్షితంగా ఉండొచ్చు. దీనికి మీరు ఇలా చేయండి..

  • – గూగుల్‌ సర్చ్‌లోకి వెళ్లి tafcop టైప్‌ చేసి ఓకే చేయండి
  •  https://tafcop.sancharsaathi.gov.in క్లిక్‌ చేయండి
  • మొదటి మీ పది అంకెల మొబైల్‌ నంబరును ఎంటర్‌ చేయండి
  • తర్వాత క్యాప్‌చా ఎంటర్‌ చేయండి
  • అనంతరం మీ మొబైల్‌ నంబరుకు OTP(ఓటీపీ) వస్తుంది
  • దానికి ఎంటర్‌ చేయండి..
  • తర్వాత మీ మొబైల్‌ నంబరుపై మొత్తం ఎన్ని చలామణిలో ఉన్నాయో వివరాలు వస్తాయం.
  • అనంతరం మీరు వాడని నంబరను బ్లాక్‌ చేయండి..
  •  తర్వాత సదరు నంబర్‌ బ్లాక్‌ అయినట్టు మీకు మెసెజ్‌ వస్తుంది.

=========================

కేజ్రివాల్‌పై అవినీతి మ‌ర‌క‌..

బీజేపీ 400 ఎంసీ సీట్లు సాధిస్తుందా..

వంద రోజులో బీఆర్ ఎస్ సీన్ రివ‌ర్్స

అబ్బుర ప‌రిచే వేయిస్తంభాల గుడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *