SOUDI AREBIYA: సౌదీ అరేబియాలోని ఓ ఔత్సాహికుడు చేసిన పోస్టు ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మారుతున్న ప‌రిణామాలుకు అద్దం ప‌డుతోంది.. ప్ర‌కృతికి ఎదురేగుతున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. మిలియ‌నీర్స్ స్టెప్స్ చేసిన ఇన్ స్టాగ్రాం పోస్టు వైర‌ల్‌గా మార‌డంతో కొత్త‌కొత్త ఆలోచ‌న‌ల‌కు తెర‌లేపుతున్నాయి. ఎడారి దేశమైన సౌదీ అరేబియాలో ఎడారులు ఎందుకు మాయ‌మ‌వుతున్నాయి.. ఇసుక ఇబ్బ‌లు ఎందుకు ప‌చ్చ‌బ‌డుతున్నాయి.. భ‌గ‌భ‌గ మండే ఇసుక‌ల్లో న‌డిచే ఒంటెలు ప‌చ్చ‌ని బ‌య‌ళ్ల మ‌ధ్య ఎలా తిరుగుతున్నాయి. ఏమిటీ ప్ర‌కృతి వింత అంటూ చ‌ర్చించుకుంటున్నారు. అత‌డు చేసిన పోస్టులలో ఎటు చూసినా ఎత్తైన ఇసుక దిబ్బ‌లు ప‌చ్చ‌బ‌డిన మొక్క‌లు, గ‌డ్డి క‌నించాయి. ఇసుక‌తో తెల్ల‌గా క‌న‌బ‌డే ఎడారులు ప‌చ్చ‌ని కొండ‌ల్ని త‌ల‌పించ‌డం విస్తుగొలుపుతోంది. ఒంటెలు ప‌చ్చిక‌ బ‌య‌ళ్ల మ‌ధ్య స్వేచ్ఛ‌గా విహ‌రిస్తూ, గ‌డ్డిని తిన‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ప్ర‌కృతిలో మార్పే కార‌ణ‌మా..

భారీ వర్షాల కార‌ణంగా సౌదీ అరేబియా ఎడారిలోని మక్కా, మదీనా, మ‌రికొన్ని ప్రాంతాలు ఇలా పచ్చగా మారాయి. వ‌ర్షాల‌తో నీటి నిల్వ‌లు పెరిగి గడ్డి, మొక్కలు పెరుగుద‌ల దోహ‌ద‌ప‌డుతోంద‌ని తెలుస్తోంది. ఒంటెలు తాజా గడ్డిని మేపుతున్నట్లు దృశ్యాలు దీన్నే తేట‌తెల్లం చేస్తున్నాయి. ఈ ప‌చ్చ‌ని దృశ్యాలు నాసా ఉపగ్రహాల నుంచి కూడా క‌నిపిస్తున్నాయ‌ని అక్క‌డివారు పేర్కొంటున్నారు.

SOUDI AREBIYA: సౌదీ అరేబియా ఎడారి అంటేనే భ‌గ‌భ‌గ మండే వేడి వాతావరణం. ఎటుచూసినా క‌నుచూపు మేర ఇసుకే క‌న‌బ‌డుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎడారిని చూసేందుకు వ‌చ్చిన వారు ఇక ప‌చ్చ‌ద‌నాన్ని చూడ‌డానికి రావాలేమో అన్న చ‌లోక్తులు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు సౌదీ అరేబియాలో ఎటు చూసినా ప‌చ్చ‌ద‌నం క‌నిపించ‌డ‌మే ఇందుకు తార్కానం.

చిగురిస్తున్న కొత్త ఆశ‌లు..

ఇప్ప‌డు సౌదీ అరేబియాలో ఇసుక ప్రాంతాల్లో గ‌డ్డి, మొక్క‌లు మొలుస్తుండ‌డంతో కొత్త ఆశ‌లు చిగురిస్తున్నాయి. భ‌విష్య‌త్తులో భారీ వ‌ర్షాలు ప‌డితే మిగ‌తా ఎడారి ప్రాంతాలు కూడా ఇలాగే మారుతాయ‌నే భావ‌న ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. అక్క‌డ ఈ ప‌రిస్థితి ఎలా సాధ్య‌మైంద‌నే చ‌ర్చ‌కూడా సాగుతోంది. ఇసుక ఎడారిలు ప‌చ్చ‌బ‌డితే.. మ‌రి ప‌చ్చ‌ని మైదానాలు భ‌విష్య‌త్తులో ఎడారులుగా మారుతాయా అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

సౌదీ అరేబియా..

సౌదీ అరేబియాను కింగ్ ఆఫ్ సౌదీ అరేబియా అంటారు. ఇది పశ్చిమాసియాలో ఉన్న ఒక అరబ్ దేశం.
అరేబియన్ ద్వీపకల్పంలో ఉన్న దేశం. ఆసియా దేశాలలో సౌదీ అరేబియా 5వ స్థానంలో, అరబ్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. సౌదీ అరేబియా మాత్రమే పర్షియన్ గల్ఫ్, ఎర్రసముద్రం సముద్రతీరాలు ఉండ‌డం విశేషం. సౌదీలో అధిక భాగం ఇసుకతో నిండిన ఎడారే ఉంది.

ఇవికూడా చ‌ద‌వండి..

వైద్య విద్య అభ్య‌ర్థుల్లో స్థానిక‌త టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌

వామ్మె.. కోకో..

ఆయుర్వేదం వ‌ర్సెస్ అలోప‌తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *