SRISHAILAM(శ్రీశైలం): అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల మల్లన్న ఆలయంలో కార్తీక మాసోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి డిసెంబరు ఒకటి వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైల మల్లికార్జున స్వామివారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈనేపథ్యంలో నెల రోజులపాటు గర్భాలయ దర్శనాలను అధికారులు నిలిపివేయాలని నిర్ణయించారు. అంతేకాదు, శని, ఆది, సోమవారాల్లో కూడా మలన్న స్పర్శదర్శనాన్ని కూడా బంద్ చేశారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు సామూహిక అభిషేకాలు, స్పర్శ దర్శనాలు యధావిధిగా కొనసాగుతాయి. కార్తికమాసం(SRISHAILAM)లో దీపాలు వెలిగించడాన్ని భక్తులు శుభప్రదంగా భావిస్తారు. వేడుకల్ని పురస్కరించుకుని ఆలయ మాఢ వీధుల్లో పెద్ద సంఖ్యలో మట్టి దీపాలు వెలిగించేందుకు నిర్వాహకులు ఆలయంలో ఈ సందర్భంగా తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్తీకమాసం పురస్కరించుకుని పండుగలు, సెలవు రోజులలో భక్తుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీలుగా కార్తీక మాసమంతా కూడా గర్భాలయ ఆర్జిత అభిషేకాలను పూర్తిగా నిలిపివేశారు.
అలాగే కార్తీకమాస రద్దీ రోజులలో అనగా శని, ఆది, సోమ వారాలు శుద్ధ ఏకాదశి, కార్తీక పూర్ణిమ మొదలైన రోజులు స్వామివారి స్పర్శదర్శనం పూర్తిగా నిలిపివేశారు. ఈ రద్దీ రోజుల్లో సామూహిక ఆర్జిత అభిషేకాలను కూడా నిలిపివేశారు. కార్తీకమాసంలో ఉచిత స్పర్శదర్శనం తాత్కాలికంగా రద్దు చేశారు. సాధారణ రోజుల్లో రోజుకు మూడు విడతలుగా స్పర్శదర్శనం, మూడు విడతలుగా సామూహిక ఆర్జిత అభిషేకాలకు అవకాశం కల్పించబడుతుంది. ఇదిలాఉండగా, ఆర్జిత అభిషేకాలు, స్పర్శదర్శనం టికెట్లను మాత్రం ఆన్‌లైన్‌లో పొందాల్సి ఉందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. కాగా, నవంబర్ నెలకు సంబంధించిన టికెట్ల కోటాను దేవస్థానం వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంచింది.టికెట్ల లభ్యతను బట్టి ప్రారంభ సమయానికి కంటే ఒక గంట ముందు వరకు కూడా భక్తులు ఆన్‌లైన్ ద్వారా టికెట్లను పొందే అవకాశం కల్పించబడిరది. టికెట్లను వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు లేదా మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని కూడా టికెట్లు పొందవచ్చు.
– క్లిక్ చేసి ఇవి కూడా చదవండి-
కేదార్‌నాథ్ ఆలయం మూసివేత..ఎప్పుడు.. ఎందుకంటే..
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్
బీజేపీలో ముసలం.. నెక్ట్స్ బాస్ ఎవరంటే..?