పాన్‌ ఇండియా గ్రేట్‌ మూవీమేకర్‌, దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దిపావళికి ముందు సప్రైజ్‌ చేశారు. కేన్యా దేశంలోని అంబోసలీ నేషనల్‌ పార్క్‌ ఫొటో షేర్‌ చేస్తూ ట్రోటింగ్‌ టు డిస్కవర్‌( కొనుగొనడం కోసం తిరుగుతున్నా) అంటూ క్యాప్షన్‌ పెట్టారు. ఎక్స్‌లో తాజాగా పోస్టు సినీ లవర్స్‌ను ఆకట్టుకుంది. దీంతో ప్రిన్స్‌ మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. రాజమౌళి తన నెక్ట్స్‌ మూవీ మహేష్‌బాబుతో తీసున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అడ్వెండచ్‌ నేపథ్యంలో మూవీ ఉంటుందని ప్రకటించిన క్రమంలో తాజాగా రాజమౌళి పోస్టు చేసిన ఫోటో ఆసక్తి చేపుతోంది. ఆయన మహేష్‌ బాబు సినిమా కోసం లొకేషన్‌ అన్వేషణలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం చిత్రబృందం ఎస్‌ఎస్‌ఎంబీ–29కు సంబంధించి ప్రి ప్రొడక్షన్‌ పనుల్లో బిజీబీజీ ఉన్నది. అడ్వెంచర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగే ఈ సినిమా కోసం చిత్రం బృందం కొద్ది రోజుల నుంచి లొకేషన్‌ అన్వేషణలో పడింది. ఇప్పటికే కొన్ని లొకేషన్స్‌ను ఒకే చేసినట్టు తెలుస్తోంది. వీఎఫ్‌ఎక్స్‌ వినియోగండంతో దిట్ట రాజమౌళి అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కూడా అదే మరింత ఎక్కువగానే ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు ఈ సినిమాల మరో అడుగు ముందుకు వేసి ఆధునిక సాంకేతికతన సద్వినియోగం చేసుకుందుకు ఏఐ(ఆర్టిఫిషన్‌ ఇంటలీజెన్స్‌) ను వియోగించనున్నట్టు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌తో తెలుగు సినిమా రేంజ్‌ను ప్రపంచానికి చాటిన విషయం తెలిసిందే. అదే స్థాయిలో తన మార్క్‌ను చూపేందుకు మహేష్‌ బాబు సినిమాను పక్కా ప్రణాళికతో ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ బడ్జెట్‌ సుమారు రూ.1000 అని గుసగుసలు వినిపిస్తున్నారు. హాలీవుడ్‌ను తలదన్నేలా రాజమౌళి సినిమా ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాలో హాలీవుడ్‌ నటులతోపాటు సాంకేతిక నిపుణులను వినియోగించుకోనున్నట్టు సమాచారం. వచ్చే నెలలో మూవీ అప్‌డేట్‌ ఇస్తారని ఫ్యాన్‌ ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *