SSA strike

SSA CONTRACT EMPLOYEES STRIKE: పిల్ల‌ల‌కు పాఠాలు బోధించేది ఎవ‌రు.. రెండు నెల‌ల్లో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు జర‌గ‌నున్నాయి. కాంట్రాక్ట్ టీచ‌ర్లు పాతిక‌రోజుల నుంచి రోజుకో తీరుతో ఆందోళ‌న చేస్తుంటే.. స‌ర్కారుకు ఏ మాత్రం ప‌ట్ట‌డం లేదు. క‌నీసం వారిని కూర్చోబెట్టి రాజీ మార్గం చేప‌ట్టిన దాఖ‌లాలు లేవు.. క‌నీసం వారి ఆవేద‌న‌ను వినే నాథుడే లేడు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, రేవంత్ రెడ్డి స‌ర్కారు ఎవ‌రికివారు బెట్టు వీడ‌క‌పోవ‌డంతో త‌ర‌గ‌తి గ‌దుల్లో పాఠాలు బోధించేవారు లేక విద్యార్థులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. మ‌రోవైపు ప‌రీక్ష‌ల గ‌డువు ముంచుకొస్తుండ‌డంతో విద్యార్థుల‌తోపాటు వారి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ప్ర‌భుత్వం స్పందించ‌డం లేదు.. ఇప్ప‌ట్లో కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళ‌న విర‌మించేలా క‌నిపించ‌డం లేదు. ఫ‌లితంగా పేద విద్యార్థుల భ‌విత‌వ్యం ప్ర‌శ్న‌ర్థ‌కంగా మారింది..

స‌మ్మేలో వేలాది మంది ఉద్యోగులు..

SSA CONTRACT EMPLOYEES STRIKE: సమగ్ర శిక్షా ఉద్యోగులు వివిధ విభాగాల్లో రాష్ట్రవ్యాప్తంగా 19325 మంది ఉన్నారు. వారంతా ప్ర‌స్తుతం సమ్మెబాట ప‌ట్టారు. మండల విద్యా శాఖాధికారుల పరిధిలో మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్‌సీ)లలో, కేజీబీవీలలో, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ (పిటిఐ) భవిత సెంటర్లలో ని ఉద్యోగులు అన్ని జిల్లాలలో కలెక్టరేట్‌ ఎదుట రోజుకో రూపంలో నిర‌స‌న తెలుపుతున్నారు. కాంట్రాక్టు టీచ‌ర్లంతా డిగ్రీ, బీఎడ్‌, టెట్‌, పీజీ చేసిన వారే. కానీ, చాలీచాలని వేతనాల‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులతో సరిపోయే అర్హతలతో నియామకమైన వారే. సుమారు 18ఏళ్లుగా కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్నా నేటికీ వారికి రూ.8వేల నుంచి రూ.19వేలు దాట‌లేదు. డిగ్రీ, బీఎడ్‌, టెట్‌, టీటీసీ అర్హతలుండి డీఎస్సీ కమిటీతో మౌఖిక పరీక్ష ఆధారంగా వీరు ఎంపికయ్యారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, రోస్టర్‌, మెరిట్‌ ప్రకారం నియామకం అయ్యారు. కేజీబీవీలు, హైస్కూళ్లలో సబ్జెక్టు, డ్రాయింగ్‌, మ్యూజిక్‌, క్రాఫ్ట్ పీఈటీలుగా కాంట్రాక్ట్‌ పద్థతిలో పని చేస్తున్నారు. ఇక ఎంఐఎస్‌లు, సీఓలు, సీఆర్‌పీ, మెసెంజర్లు, కేర్‌ టేకర్‌లు మండల విద్యా శాఖ పరిధిలో పని చేస్తున్నారు.

సీఎంయే.. మాట త‌ప్పితే…

SSA CONTRACT EMPLOYEES STRIKE: కాంట్రాక్టు టీచ‌ర్లు ఏళ్ల నుంచి త‌మ‌ను రెగ్యుల‌రైజ్ చేయాల‌ని ప్ర‌భుత్వాల‌ను కోరుతూ వ‌స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల వేళ అంద‌రినీ రెగ్యుల‌రైజ్ చేస్తామంటూ ప్ర‌స్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఊరూరా ఎన్నిక‌ల ప్ర‌చారం లో హామీలు గుప్పించారు. టీ తాగే అంత‌లో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని గొప్ప‌లు పోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి ఏడాది దాటినా.. ఉద్యోగులు పాతిక రోజుల నుంచి నిర‌స‌న‌లు తెలుపుతున్నా క‌నీసం వారి బుజ్జ‌గించే ప్ర‌య‌త్న‌మూ చేయ‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఈ మాత్రం దానికి హామీలు గుప్పించ‌డం ఎందుకంటూ ఉద్యోగుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటోంది.

కేజీవీబీల విద్యార్థుల గోడు వినేవారేరి..

క‌స్తూర్బా గాంధీ విద్యాల‌యాల విద్యార్థులు ప‌రిస్థితి మ‌రీ ద‌య‌నీయంగా మారింది. అక్క‌డ ఉన్న‌ది అంతా కాంట్రాక్టు ఉద్యోగులే. వారంతా ఇప్ప‌డు స‌మ్మేలో ఉన్నారు. దాంతో విద్యార్థులను ప‌ట్టించునేవారే క‌రువ‌య్యారు. క‌నీసం రాత్రి విద్యార్థినుల‌ను చూసుకునేవారు క‌రువ‌య్యారు. రోజంతా డిప్యూటేష‌న్‌పై రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌ను డిప్యూటేష‌న్‌పై విధులు వేస్తున్నా వారం వెళ్లేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు.

 

READ MORE: ఇండస్ట్రీకి తలవంపులు.. తమ్మారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

READ MORE: అల్లు అర్జున్‌ పొలిటికల్‌ ఎంట్రీ?

READ MORE: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *