HYDARABD DRUG: భాగ్యనగర‌రాన్ని(హైద‌రాబాద్‌) డ్రగ్స్‌ మహమ్మారి వీడటం లేదు. త‌ర‌చూ సంఘ‌ట‌ల‌ను చోటు చేసుకోవడం క‌ల‌ర‌వ‌ర‌పెడుతోంది. ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం తోనే ఇలాంటి అసాంఘిక శ‌క్తులు పెట్రేగిపోతున్నాయ‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మవుతున్నాయి. గ‌త బీఆర్ ఎస్ ప్రభుత్వంలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లో చోటుసుకున్నాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలోనూ కొన‌సాతుండ‌డంతో హైద‌రాబాద్ వాసులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కొన్నేళ్ల నుంచి ఎక్కడో ఒక చోట డ్రగ్స్‌ పట్టుబడుతూనే ఉంది. ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో యువత చెడు మార్గాలను ఎంచుకుంటోంది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలైన పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నత చదువులు చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించి స్థిరపడాల్సిన కొంతమంది యువత చెడుమార్గాలను ఎంచుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో కేటీఆర్ బామ‌మ‌రిది డ్ర‌గ్ కేసులోప‌ట్టుబ‌డిన మూడురోజుల‌కే మ‌రో ఘ‌ట‌న చోటుచేస‌కోవ‌డం హైద‌రాబాద్ వాసుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది.

పక్కా సమాచారంతో హైద‌రాబాద్‌(HYDARABD DRUG)లోని సుష్మ సినిమా టాకీస్ వద్ద చాక‌చ‌క్యంగా పోలీసులు డ్రగ్స్‌ను పట్టుకున్నారు. అయితే డ్రగ్స్‌ను విక్ర‌యించింది బీటెక్‌ విద్యార్థి అని తెలిసి పోలీసులే ఖంగుతిన్నారు. హైద‌రాబాద్‌లోని వనస్థలిపురంలో సుష్మ సినిమా థియేటర్‌ వద్ద జాన్ అనే బీటెక్ విద్యార్థి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముంద‌స్తు స‌మాచారం అందుకున్న పోలీసులు ప‌క్కా ప్లాన్‌తో దాడులు చేసి ప‌ట్టుకున్నారు. ముంద‌స్తు స‌మాచారం అందుకున్న హయత్‌నగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు థియేట‌ర్ వ‌ద్ద శిక్షిత త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో డ్రగ్స్‌ విక్రయిస్తూ జాన్ అనే బీటెక్‌ విద్యార్థి ని చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు. అయితే జాన్ అమానాస్పదంగా సంచరిస్తున్న గుర్తించి ప‌ట్టుకున్నారు. జాన్ నుంచి 7 గ్రాముల ఎండీఎమ్‌ఏ ర‌కం డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సెల్‌ఫోన్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వ‌ద్ద దొరికిన ఎండీఎంఏ ర‌కం డ్ర‌గ్ గ్రాము ధ‌ర రూ. 2500కు జాన్ కొనుగోలు చేసి, రూ.5000 చొప్పున విక్ర‌యిస్తున్న‌టు్ట హ‌య‌త్‌న‌గ‌ర్ పోలీసులు విచారణలో తెలుసుకున్న‌ట్టు స‌మాచారం.

జాన్‌ది ఆంధ్ర ప్ర‌దేశ్‌లోని నెల్లూరు..
నిందితుడు జాన్‌ది ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలని నెల్లూరుగా పోలీసులు విచార‌ణ‌లో తేలింది. జాన్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *