SUMA KANAKALA: ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. సుమ వ్యవసాయ క్షేత్రంలో దిగి మహిళా కూలీలతో వరి నారువేశారు. కూలీలతో కలిసి నాటు వేయడమేకాక వారిలో ఉత్సాహం నింపేందుకు పొలంలోనే ఆనంద నృత్యం చేశారు. కూలీలతో మాట్లాడుతూ వారు ఎంత కష్ట పడుతున్నారో వివరిస్తూ వారికి సెల్యూట్ చేశారు. పొలం గట్లపై నుంచి నడుస్తూ, పంపు సెట్టు వద్ద బుదరను కడుకుంటూ కూలీల కష్టాలను కళ్లకు కట్టారు. కొంగు నడుం చుట్టుకుని, ఒకచేత్తో నారు పట్టు కుని ఒక్కొక్కటిగా నారు వేశారు. ఈ దృశ్యాన్ని వీడియోలో చిత్రీకరించారు. ఈ వీడియోని తన ఇన్ స్టాంలో పోస్టు చేశారు. దీనికి
“నాకు వ్యవసాయం ఎప్పుడూ ఒక గొప్ప అనుభవంగా ఉంది కాబట్టి ప్రకృతితో ముడిపడి ఉంటుంది.. కొన్నిసార్లు మనం వెళ్లి నేలను అనుభూతి చెందాలి రైతులందరికీ: మేము మీకు వందనం చేస్తున్నాము మరియు మీరు మా కోసం చేస్తున్నందుకు ధన్యవాదాలు, ప్రతిరోజూ మాకు మీరు కావాలి” అంటూ ట్యాగ్ చేశారు.
సుమ(SUMA KANAKALA) మహిళాకూలీలను స్వయంగా తెలుసుకోవడంతోపాటు వారి కష్టాను వివరించడంతో నెటిజన్లు శభాష్ సుమక్క అంటూ పొగిడారు. వ్యవసాయం ఎంత కష్టమే అక్కకు అర్థమైందంటూ ఆనందం వ్యక్తం చేశారు. రైతుకు ఇలా సపోర్టు చేయడం సుమలోని గొప్ప దనాని నిదర్శనమంటూ ఓ నెటిజన్ వెల్లడించారు.
మరెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్ వేయండి.
సుమ కనకాల ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నాడు. వంటలు, డ్యాన్స్, ఫ్యామిలీతో సరదా కబుర్లతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నారు. ఎప్పటి కప్పుడు తన సుమ కనకాల ఇంస్టాగ్రాం అప్డేట్ ఇస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
*మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం జనదూత వెబ్ సైట్ హోం పేజీలో చూడండి*