TEST MATCH: న్యూజిలాండ్‌ తో జరుగుతున్న రెండో టెస్టులోకూ టీం ఇండియా ఘోర ఓటమిని చవిచూసింది. ఇటు బౌలింగ్‌, అటు బ్యాటింగ్‌లో తడబడిన అతిథ్య టీమిండియా ఓటమితో పరాభవాన్ని మూటగట్టుకుంది. మూడు రోజుల్లోనే ఆటముగిసింది. మూడు టెస్టుల సిరీస్‌ 0-2తో న్యూజిలాండ్‌ కైవసం చేసుకోగా, నామమాత్రమైన మూడో టెస్టు ముంబాయిలోని వాంఖడే స్టేడియంలో నవంబర్‌ 1న ప్రారంభం కానుంది. తొలి టెస్టులో విజయం సాధించిన కివీ జట్టు రెండో టెస్టులోనూ అదే జోరు కొనసాగించింది. ఏకంగా 113 పరుగులతో విజయకేతనం ఎగురవేసింది. పూనేలో జరుగుతున్న రెండో టెస్టు లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్‌లో 259 పరుగులకు ఆలౌట్‌ కాగా, రెండో ఇన్నింగ్‌లో 255 రన్స్‌ చేసింది. కాగా తొలి ఇన్నింగ్‌లో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం 156 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. రెండో ఇన్నింగ్‌లో నైనా పుంజుకుంటారని టీమిండియా ఫ్యాన్స్‌ ఆశించగా, కేవలం 245 పరుగులకే ఆలౌట్‌ ఓటమిపాలైంది. తొలి ఇన్నింగ్‌లో కాన్వే 76, రచిన్‌ రవీంద్ర 65 పరుగుతో రాణించారు. ఇండియా బౌలర్‌ వాషింగ్‌ టన్‌ సుందర్‌ 59 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీసుకోవడం విశేషం. అదే తొలి ఇన్నింగ్‌లో ఇండియా 156 పరుగులు చేయగా, యశస్వి జైస్వాల్‌(30), గిల్‌(30), రవీంద్ర జడేజా (38) మినహా ఎవరూ రాణించలేదు. కివీ బౌలర్‌ శాంట్నర్‌ 53 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టి ఇండియా నడ్డి విరిచారు. రెండో ఇన్నింగ్‌లో లాథమ్‌ 86 పరుగులతో ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్‌లో వాషింగ్‌టన్‌ సుందర్‌ 56 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు, జడేజా 72 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్‌లో జైస్వాల్‌ 75(65 బ ంతుల్లో), జడేజా 42(84 బంతుల్లో) మినహా ఎవరూ రాణించలేదు.

చేతులెత్తేసిన టాప్‌ బ్యాటర్లు

రెండో టెస్టులో ఇండియా టాప్‌ బ్యాటర్లు చేతెలెత్తేశారు. ముఖ్యంగా విరాట్‌ హోహ్లీ, కెప్టన్‌ రోహిత్‌ శర్మ పూర్తిగా నిరాశపరిచారు. జైస్వాల్‌ మినహా కివీ బౌలర్లను ఎదుర్కొనేందుకు టాప్‌ బ్యాటర్లు ముప్పుతిప్పలు పడ్డారు. బౌలింగ్‌లోనూ మెరుపులేక పోవడం ఫ్యాన్స్‌ను నిరాశపర్చింది. ఒక్క వాషింగ్‌టన్‌ సుందర్‌, జడేజా మినహా మిగతా బౌలర్లు ప్రభావం చూపలేక పోయారు.

* ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా మిచెల్‌ సాంట్నర్‌ నిలిచారు.

* మూడో టెస్టు ముంబాయిలోని వాంఖడే స్టేడియంలో నవంబర్‌ 1న ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *