టెట్ – 2024 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. టెట్ ఫలితాల్లో 50.79 శాతం మంది అర్హత సాధించారు. మొత్తం 1,87,256 మంది అర్హత పొందారు. అక్టోబర్‌లో జరిగిన టెట్ -24 పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరుకాగా అందులో 1,87,256 ( 50.79 శాతం) మంది అర్హత సాధించారు. కాగా, ఫలితాలను వెబ్‌సైట్ లో పొందుపర్చారు. నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల మంత్రి లోకేష్ వెల్లడించారు. టెట్‌లో అర్హత సాధించిన వారందరికీ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా.. గత నెలలో (అక్టోబర్) ఏపీ టెట్ -2024 పరీక్షను నిర్వహించారు. ఇదిలా ఉండగా టెట్‌కు 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3,68,661 మంది మాత్రమే పరీక్ష రాశారు. వారిలో 58,639 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. త్వరలోనే మెగాడీఎస్సీ నోటిఫికేషన్ 16,347 పోస్టులతో సర్కార్ జారీ చేయనున్న నేపథ్యంలో ఫలితాలపై అభ్యర్థుల్లో ఆసక్తి పెరిగింది. టెట్‌లో అర్హత సాధించినవారికి డీఎస్సీలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకుముందు టెట్ అర్హత సర్టిఫికెట్ ఏడేళ్లు మాత్రమే చెల్లుబాటయ్యేది. 2022 నుంచి దీన్ని జీవిత కాలానికి మార్చారు. 2022 టెట్‌లో చాలామంది అర్హత సాధించినా మార్కుల్లో మెరుగుదల కోసం చాలామంది ఇప్పుడు మరోసారి పరీక్ష రాశారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
==============================
ఐఎఎస్ అధికారికి తప్పిన ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణీ ప్రసాద్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ వాహనాన్ని ఓవర్‌టెక్ చేయబోయి ప్రమాదవశాత్తు పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. అయితే, ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. దీంతో భారీ ప్రమాదం తప్పినట్లయ్యింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన జరిగిన తీరు గురించి ఆరా తీశారు. ఆమెను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. వాణీ ప్రసాద్ మొన్నటి వరకు తెలంగాణ కేడర్‌లో కొనసాగారు. ఇదిలాఉంటే వాణి ప్రసాద్‌ను ఇటీవల కేంద్రం పీ కేడర్‌కు కేటాయించారు. ఏపీ ప్రభుత్వంలో ఆమె కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా పని చేస్తున్నారు.
– క్లిక్ చేసి ఇవి కూడా చదవండి-
తెలుగు వారిని అంత మాటంటావా.. నటి కస్తూరిపై ఫైర్
మబ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచారణం
ఇంటింటి సర్వే డేటా భద్రమేనా.. అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్తే..
కేదార్‌నాథ్ ఆలయం మూసివేత..ఎప్పుడు.. ఎందుకంటే..
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్
బీజేపీలో ముసలం.. నెక్ట్స్ బాస్ ఎవరంటే..?