అందుబాటులోకి వచ్చిన వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం
Thousand Pillars Temple : వరంగల్ లోని వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం పునఃప్రారంభమైంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత పనులు పూర్తి కావటంతో మార్చి 8వ తేదీన పునరుద్ధరించిన కల్యాణ మండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. కాకతీయుల కళా నైపుణ్యానికి ప్రతీక వరంగల్ నగరంలోని వేయి స్తంభాల గుడి (Warangal 1000 Pillar Temple). డెవలప్ మెంట్ పేరుతో 2006లో ఆలయంలోని కల్యాణ మండపాన్నిపూర్తిగా తొలగించి, పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారినా అనుకున్న టైంలో వర్క్స్ కంప్లీట్ కాలేదు.
కాకతీయుల కళా నైపుణ్యానికి ప్రతీక వరంగల్ నగరంలోని వేయి స్తంభాల గుడి (Warangal 1000 Pillar Temple). డెవలప్ మెంట్ పేరుతో 2006లో ఆలయంలోని కల్యాణ మండపాన్ని తొలగించి, పునరుద్ధరించే పనులు చేపట్టారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారినా అనుకున్న టైంలో వర్క్స్ కంప్లీట్ కాలేదు. దాదాపు 17 ఏళ్ల తర్వాత పనులు పూర్తి కావటంతో మార్చి 8వ తేదీన పునఃప్రారంభించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పునరుద్ధరించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించారు.
వెయ్యి స్తంభాల గుడిలోని కల్యాణ మండపాన్ని తొలగించిన పురావస్తు శాఖ అధికారులు 2006 నుంచి 2022 వరకు, అంటే దాదాపు 16 ఏళ్ల వరకు వాటిని హనుమకొండ పద్మాక్షి ఆలయ సమీపంలో పెట్టారు. ఒకట్రెండు ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని చెప్పి, దశాబ్ధంన్నరకు పైగా కాలయాపన చేశారు. కల్యాణ మండపాన్ని తొలగించిన అధికారులు.. పునరుద్ధరణ పనులను అప్పట్లో తమిళనాడుకు చెందిన స్థపతి శివకుమార్ కు అప్పగించారు. కేంద్ర పురావస్తుశాఖ నుంచి దాదాపు రూ.7.5 కోట్లు పునరుద్ధరణ పనులకు కేటాయించడంతో పనులను మొదలు పెట్టారు.
ఎక్కువగా చదివినవి:
* కేజ్రివాల్‌పై మరక.. ఎందుకు దారి తప్పాడో?