TIRUMAL VIP: తిరులమ తిరుపతి దేవస్థాన కమిటీ రాజకీయ నాయకులు, వీఐపీలకు జలక్ ఇచ్చింది. స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో మీడియా, సోషల్ మీడియాతో మాట్లాడడం చాలా రోజుల నుంచి అమలులో ఉంది. ఈ ఆచారానికి టీటీడీ చెక్ పెట్టాలని భావిస్తోంది. ఇకపై ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరిస్తోంది. రాజకీయ నేతలు, వీఐపీలు మీడియా, సోషల్ మీడియాతో సైతం ముచ్చటించవద్దని స్పష్టం చేస్తోంది. ఈ కొత్త నిబంధనల నేటి(నవంబరు 30) నుంచే అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధన ప్రకారం.. ఎవరైనా రాజకీయ ప్రసంగాలు, విద్వేషిత వ్యాఖ్యలు, విమర్శలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరించింది. తిరుమల స్వామివారి పవిత్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ కొత్త నిబంధనతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా కేంద్రంగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
READ MORE: తిరుమల రహస్యాలు ఇవిగో..
వంశీనాథ్‌రెడ్డి ఫొటోషూట్ కొత్త రూల్..
TIRUMAL VIP: టీటీడీ కొత్తరూల్ తేవడానికి వల్లూరి వంశీనాథ్‌రెడ్డి వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం వంశీనాథ్‌రెడ్డి (కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడు) స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం తర్వాత గుడి ప్రాంగణంలో ఫొటోగ్రాఫర్లతో వీడియోలు, ఫొటోలు తీయించుకుంటూ హల్‌చల్ చేశారు. ఫొటోషూట్‌ను గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతడికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. కాసేపటికే మళ్లీ వచ్చి ఫొటోషూట్ చేయడంతో భక్తుల ఆగ్రహానికి కారణమైంది. దీనిపై టీటీడీకి ఫిర్యాదు అందండంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వంశీనాథ్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది.
READ MORE: చలో శుక్రయాన్ !
రాజకీయ ప్రసంగాలపై విమర్శలు..
TIRUMAL VIP: తిరుమలలో వీఐపీలు, రాజకీయ నేతలు ఇటీవల కాలంలో రాజకీయ ప్రసంగాలు చేయడం ఎక్కుమైంది. కొందరు వీఐపీలు కూడా విద్వేషాలు పెంచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విషయంపై ఎప్పటి నుంచో భక్తుల నుంచి ఫిర్యాదులు అందుతున్నా అంతగా పట్టించుకోలేదు. కాగా తాజా ఘటనతో టీటీడీ ఎట్టకేలకు ఈ నిబంధన తీసుకురావడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీడియా కనబడగానే వీఐపీలు రాజకీయ, బిజినెస్ ప్రసంగాలు చేయడంతో తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు. వీఐపీలు కూడా మీడియాతో ప్రసంగించే సమయంలో స్వీయ నియంత్రణ పాటించాలని కోరుతోంది.
కాలినడన భక్తులకు ఆ దర్శనం ఇవ్వండి..
కాలినడకన గుట్టపైకి చేరుకుని చేరుకున్న భక్తులకు నేరుగా స్వామివారి దర్శనం లభించేది. కొత్తగా వారికి దర్శనం నిలిపివేశారు. కొత్త నిబంధనలు అమలు చేస్తున్న టీటీడీ కాలినడన వచ్చే భక్తులకు పాత పద్ధతిలో దర్శనం కల్పించాలని కోరుతున్నారు.
READ MORE: ఇండియా.. టమాటా వైన్ తయారీ ..