EARTHQUAKE: పొద్దుపొద్దునే భూకంపం సంభవించడంతో ప్రజలకు భయాందోళనకు గురయ్యారు. ఈసారి ఏకంగా నాలుదైదు దేశాల్లో కంపించడం కలవరపెట్టింది. గత డిసెంబరు 27(2024)లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో భూమి కంపించగా, నేడు (7జనవరి 2025) ఇండియాతోపాటు నేపాల్, చైనా, బంగ్లాదేశ్ మరియు టిబెట్‌లో ఉదయం 6.30 నుంచి 6.40గంటల సమయంలో కంపించింది. విషయం తెలిసి ఆయా ప్రాంత ప్రజలు భయంతో వణికిపోయారు. నేపాల్‌లోని ఖాట్మాండులోని లుబుచే భూకంప కేంద్రంలో దీనిని గుర్తించారు. లుబుచేకు కేవలం 93 కిలోమీటర్ల దూరంలో సంభవించినట్టు నేపాల్ గుర్తించింది. ఇక్కడి రిక్టర్ స్కేల్‌పై 7.1గా నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 6.35 గంటలకు కంపించినట్టు కనుగొన్నారు. అలాగే టిబెట్ మరియు చైనా సరిహద్దులోని షిగాట్సేకే కేవలం 23 కిలోమీటర్ల దూరంలో ఉదయం 6.35 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదైంది. అదే సమయంలో బంగ్లాదేశ్ కూడా కంపించినట్టు అధికారులు పేర్కొన్నారు. భూకంపం తీవ్రతను రిక్టర్ స్కేల్ ద్వారా కొలుస్తారు, మరియు ఆ ప్రభావాన్ని సాంప్రదాయంగా “సీస్మోగ్రాఫ్” అనే పరికరంతో గుర్తిస్తారు.
-
వణికిపోయిన ఉత్తరభారతం
-
తెల్లవారుజామున భూమి కంపించడంతో ఉత్తర భారతం గడగడలాడింది. ఢిల్లీలోని ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు నెలకొన్నాయి. అలాగే పాట్నా, అస్సాం మరియు బెంగాల్‌లోని పలు జిల్లాలో భూమి కంపించినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. బీహార్‌లోని షెయోహర్‌లో కూడా 7.1రిక్టర్ స్కేల్‌పై నమోదైంది.
రెండు రోజుల క్రితం కూడా..
TODAY EARTHQUAKE: రెండు రోజుల క్రితం (జనవరి5) కూడా కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. బెలిజ్, కోస్టారికా, ఎల్‌సాల్వడార్, గ్వాటెమాల, హూండురాస్, నిర్వాగ్వా మరియు మెక్సికో దేశాల్లో జకాటీకోల్యూక నుంచి 60 కిలోమీటర్ల దూరంలో కంపించింది. ఇది 6.2 తీవ్రతగా నమోదైంది.
ఉదయమే ఎందుకు…
ఇటీవల ఉదయమే భూమి కంపించడం కలవరపెడుతోంది. గత డిసెంబరు (2024)లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీష్‌ఘడ్ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఉదయం పూటనే సంభవించింది. ఇది యాదృశ్చికమా.. లేక ప్రకృతి ప్రకోపమా అన్న అనుమానాలు సామాన్యుల్లో రేకెత్తుతున్నాయి. అయా 2 నుంచి 7 నిమిషాల వరకు భూకంపం సంభవించింది. తాజాగా నేపాల్, చైనా, ఇండియాలోని ఉత్తరాది రాష్ట్రాల్లో మంగళవారం కూడా ఉదయమే అదికూడా రెండు, మూడు నిమిషాల పాటు సంభవించడం గమనార్హం.
భూమి ఎందుకు కంపిస్తుంది?
TODAY EARTHQUAKE: భూమి ఉపరితలం పెద్ద పెద్ద టెక్టానిక్ ప్లేట్లుగా విభజించబడింది. ఈ ప్లేట్లు నిరంతరం కదులుతుంటాయి. ప్లేట్లు ఒకదానికొకటి తగలడం (కన్వర్జెంట్ బౌండరీలు) జరుగుతుంది. కొన్ని సమయాల్లో ఒకదానికొకటి దూరంగా వెళ్లడం (డైవర్జెంట్ బౌండరీలు) తెలిసిందే. అలాగే పక్క పక్కన సాగే కదలికలు (ట్రాన్స్‌ఫార్మ్ బౌండరీలు) సమయంలో భూమి లోపల ఉన్న శక్తి విడుదలవుతుంది. ఫలితంగా భూమి కంపిస్తుంది.
- జ్వాలాముఖుల విస్ఫోటనాల సమయంలో భూమిలో భారీ స్థాయిలో శక్తి విడుదల అవుతుంది. ఇది సమీప ప్రాంతాల్లో భూమి కంపించడానికి కారణం అవుతుంది.
- భూమిలో ఉన్న గుహలు లేదా ఖాళీ ప్రదేశాలు (వాటర్ టేబుల్స్, ఖనిజ గుహలు) కోల్పోవడం వల్ల కూడా భూమి కంపించవచ్చు.
- పెద్ద పేలుళ్లు లేదా భూభాగాల తవ్వకాలు (ఖనిజ తవ్వకాలు) జరినప్పుడు కూడా భూకంపంకు కారణం కావచ్చు. పెద్ద రిజర్వాయర్లు లేదా డ్యామ్‌ల వల్ల భూమిలో మృదుల కదలికలు ఏర్పడాయి.
- ===============
- READ MORE: వరంగల్‌కు పొంచి ఉన్న ముప్పు
- READ MORE: పెరుగుతున్న HMPV కేసులు