T20 CRIKET : సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ వైట్‌వాష్‌తో కోల్పోయి, న్యూజిలాండ్‌ చేతిలో ఘర పరాభవాన్ని చవిచూసిన టీం ఇండియా టీ–20లో అనూహ్యంగా పుంజుకోవడంతో క్రికెట్‌ క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సౌతాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన తొలి టీ–20లో విజయభేరి మోగించి ఉత్సాహంతో ఉన్న టీమిండియా రెండో టీ–20కి రెడీ అయింది. ఫస్ట్‌ మ్యాచ్‌లో అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్‌లోనూ రాణించిన ఇండియన్‌ ప్లేయర్లు రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌లో మరో అడుగు ముందుకువేయాలని చూస్తోంది. అలాగే, సొంతగడ్డపై ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న సౌతాఫ్రికా తన వ్యూహాలకు పదును పెడుతోంది. కాగా ఈ రోజు (నవంబరు–11)రాత్రి 7.30గంటలు సౌత్‌ ఆఫ్రికాలోని గెబేహాలో టీ–20రెండో మ్యాచ్‌ జరగనుంది. పిచ్‌ పేసర్లుకు అనుకూలంగా ఉంటుందని పిచ్‌ ఎక్స్‌పర్ట్స్‌ పేర్కొంటున్నారు. అలాగే బ్యాటర్లకూ అనుకూలమని చెబుతున్నారు. ఇరుజట్లు ఎలాంటి మార్పులు లేకుండానే రెండో మ్యాచ్‌లో బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది. నాలుగు మ్యాచ్‌లో టీ-20లో 1-0 తేడాతో భార‌త్ ముందుంది.

చూపంతా సంజు పైనే..

T20 CRIKET తొలిమ్యాచ్‌ హీరో.. సెంచరీ వీరుడు సంజు శాంసన్‌పైనే అందరి దృష్టి పడింది. వరుసగా రెండు సెంచరీలు సాధించిన సంజు మూడో సెంచరీపై కన్నేశాడు. టీమిండియా అభిమానులకు కూడా అదే కోరుకుంటున్నారు. మరోవైపు సంజును కట్టడి చేసే విషయంలో సౌత్‌ ఆఫ్రికా వ్యూహాలకు పదునుపెడుతోంది. ఓపెనర్‌గా వచ్చే సంజును కట్టడి చేస్తే భారీ స్కోర్‌ను కట్టడిచేయొచ్చని భావిస్తోంది. సాధ్యమైనంత వరకు తొందరగా అతడిని ఔట్‌ చేయాలని వ్యూహం పన్నుతోంది.

ఇండియాకు కొత్త కలవరం..

T20: టీ–20లో టీం ఇండియాను ఓ సమస్యల కలవరపెడుతోంది. అనుకున్న స్థాయిలో బ్యాటర్లు రాణించకపోవడం తలనొప్పిగా మారుతోంది. కొంతకాలంగా మ్యాచ్‌లో ఎవరో ఒక బ్యాటర్‌ మాత్రమే రాణిస్తున్నారు. అతడికి మరో బ్యాటర్‌ అండగా నిలవలేకపోతున్నారు. చాలామంది బ్యాటర్లు నిలకడ లేకపోవడం టీమిండియా ఫాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తొలి మ్యాచ్‌లోనూ అదే జరిగింది. ఓవైపు సంజు బ్యాటింగ్‌లో టాప్‌గేర్‌ వేస్తే.. అతడికి సపోర్టుగా ఒక్క బ్యాటర్‌ నిలవకపోవడమే ఇందుకు ఉదాహరణ. దాదాపు ఒక దశలో 240 వరకు స్కోర్‌ వెళ్తుందని భావించినా, వరుసగా వికెట్లు పడడంతో 202 పరుగులతోనే సరిపుచ్చుకోవాల్సింది. రెండో మ్యాచ్‌లో టాస్ కీల‌కంగా మార‌నుంది.

అభిషేక్‌ రాణించకుంటే …

ఐపీఎల్‌లో వీరవిహారం చేస్తే అభిషేక్‌ శర్మ టిమిండియాకు అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కీలక బ్యాటర్‌గా మారిన అభిషేక్‌ ఇండియా మ్యాచ్‌లలో సరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. జింబాబ్వేలో సెంచరీ కొట్టాక ఆ స్థాయిలో ఇన్నింగ్‌ ఇంత వరకు ఆడలేదు. అయినా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. ఓపెన్‌గా మంచి ఛాన్స్‌ వచ్చినా నిరాశపర్చుతున్నాడు. తొలి టీ–20 మ్యాచ్‌లో విఫలమైనా అభిషేక్‌ రెండో మ్యాచ్‌లోనైనా రాణించాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు. టాలెంట్‌ ఉన్న శర్మ గాడిలో పడడానికి ఒక్కఛాన్స్‌ చాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో తన స్థాయి ఆట ఆడాలని అభిమానులు కోరుతున్నారు.

సౌతాఫ్రికాను అంత చిన్న అంచనా వేయొద్దు..

T20:ఫస్ట్‌ టీట్వంటీ మ్యాచ్‌లో ఓటమి చెందిన సౌతాఫ్రికాను అంత చిన్న అంచనావేయొద్దని క్రికెట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సొంతగడ్డపై అది ఎంతో బలమైన జట్టని పేర్కొంటున్నారు. శరవేగంగా పుంజుకోవడం వారికి పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. ఆ జట్టులో ఎనిమిది మంది హిట్‌ బ్యాటర్లు ఉన్నారు. వారిలో ఏ ఒక్కరు రాణించిన ఎంత పెద్ద లక్ష్యమైనా సునాయాసంగా చేధించగలరు. పెద్దపెద్ద ఇన్నింగ్స్‌ ఆడడంతో వారు దిట్ట. క్లాసెన్‌, మార్‌క్రమ్‌, మిల్లర్‌, స్టబ్స్‌ల వీరవిహారం గురించి క్రికెట్‌ అభిమానులకు తెలియంది కాదు. బౌలింగ్‌లోనూ బలంగానే ఉంది. రెండు జట్లు వ్యూహ ప్రతివ్యూహాలతో రెండో టీ–20కు ఇరు జట్లు రెడీ అయ్యాయి.

తుది జట్లు(T20 CRIKET )
ఇండియా: అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌(కీపర్‌), సూర్య కువర్‌యాదవ్‌ (కెప్టెన్‌) తిలక్‌ వర్మ, హార్దిక్‌ ప్యాండ్యా, రింకూసింగ్‌, అక్షర్‌పటేల్‌ లేదంటే రమణ్‌దీప్‌, రవి బిష్ణోయ్‌, అర్హదీప్‌సింగ్‌, అవేష్‌ఖాన్‌, వరుణ్‌ చక్రవర్తి

సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్‌, మార్‌క్రమ్‌(కెప్టెన్‌) క్లాసెన్‌, స్టబ్స్‌, డేడ్‌మిల్లర్‌, యాన్సెన్‌, క్రుగర్‌, కేశవ్‌ మహరాజ్‌, ఎంగబా పీటర్‌, సిమ్‌లైన్‌.

MATCH : 7.30 PM: GEBEHA : LIVE

 

–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్‌ చేసి చదవండి–

రెచ్చిపోయిన సంజు శాంస‌న్‌..

నిట్‌లో ఫుల్ జోష్‌..

మహేష్‌ బాబు కోసం రాజమౌళి వెతుకులాట

వంద రేప్‌లు చేశాడు.. వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు..

తెలుగు వారిని అంత మాటంటావా.. న‌టి కస్తూరిపై ఫైర్‌

ఎలాన్ ముస్క్ కు ట్రంప్ బిగ్ ఆఫర్..

కుల గ‌ణ‌న‌ షురూ.. కానీ..

స‌ర్వే డేటా భ‌ద్ర‌మేనా.. ప్ర‌జ‌లకు అనుమానాలు.. ముప్పు ఇదేనా..

వాటిని.. డ్రీమ్ గ‌ర్ల్ హేమామాలిని బుగ్గ‌లుగా మారుస్తా..

ఒలింపిక్ కు ఇండియా స‌న్నాహాలు

టీడీపీ- జ‌న‌సేన మ‌ధ్య ముదిరిన వార్‌

మ‌న మెద‌డు పెరుగుతోంది.. లాభ‌మా .. న‌ష్ట‌మా..

మ‌బ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచార‌ణం

ఇంటింటి స‌ర్వే డేటా భ‌ద్ర‌మేనా.. అసాంఘిక శ‌క్తుల చేతిలోకి వెళ్తే..

కేదార్‌నాథ్ ఆల‌యం మూసివేత‌..ఎప్పుడు.. ఎందుకంటే..

విస్త‌రిస్తున్న షుగ‌ర్ డాడీ.. ఆ ప‌నికోస‌మేనా..

రికార్డు సృష్టించిన అయోధ్య

న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్‌

దొరికిన కుంభకర్ణుడి ఖడ్గం

రామగుండం కొత్త చరిత్ర

బీజేపీలో ముస‌లం.. నెక్ట్స్ బాస్ ఎవ‌రంటే..?

మెడిక‌ల్ వార్‌: ఆయుర్వేదం వ‌ర్సెస్ అలోప‌తి

ప‌డిపోతున్న ఇండియా గ్రాఫ్‌.. కానీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *