KEDARNATH : ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన, హిందువుల‌కు అత్యంత ప‌విత్ర‌మైన క్షేత్రం కేదార్‌నాథ్‌. ప్ర‌తీ హిందువు త‌న జీవితంలో ఒక్క‌సారైనా కేదార్‌నాథ్‌ను ద‌ర్శించుకోవాలని భావిస్తుంటారు. మంచుకొండ‌ల్లో భ‌క్తిభావం ఉప్పొంగే పుణ్య‌క్షేత్రం ఈ కేదార్‌నాథ్‌. కానీ ఈ ఆల‌యం ఏడాదంతా తెరిచిఉండ‌ది. ఆరు నెల‌లు గుడి తెరుచుకునిఉంటే.. మ‌రో ఆరునెల‌ల మూసి ఉంటుంది. దీనికీ కార‌ణం లేక‌పోలేదు. ఇందులో భాగంగా రేప‌టి(ఆదివారం- న‌వంబ‌రు 3) నుంచి కేదార్‌నాథ్ ఆల‌య ద్వారాలు ఆరు నెల‌ల‌పాటు మూసి ఉంచ‌నున్నారు. ఆదివారం ప్ర‌త్యేక పూజ‌ల అనంత‌రం ఉద‌యం 8.30గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు మూసివేస్తారు. దాంతో భ‌క్తుల‌కు ఆరు నెల‌ల‌పాటు స్వామి వారి ద‌ర్శ‌నం నిలిచిపోనుంది. 12 జ్యోతిర్లింగాల‌లో కేదార్‌నాథ్ ఒక‌టి. వివ‌రాల్లోకి వెళితే..

ప్ర‌తికూల వాతావ‌ర‌ణంలో ప్ర‌యాణం..

హిందువులు ప‌ర‌మ ప‌విత్ర స్థ‌లమైన కేదార్‌నాథ్ (KEDARNATH ) ఆల‌యం ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోని రుద్ర ప్ర‌యాగ జిల్లాలో ఉందీ ఆల‌యం. కేదార్‌నాథ్‌(శివుడు) భ‌క్తులు పూజ‌లు అందుకుంటున్నాడు. ఆలయానికి చేరుకోవాలంటే గౌరీకుండ్ నుంచి 22 కి.మీ ఎత్తుకు కాలిన‌డ‌న వెళ్లాల్సి ఉంటుంది. రోడ్డు మార్గం లేక‌పోవ‌డంతో న‌డ‌వ‌లేని వారు డోలీల సాయంతో చేరుకోవ‌చ్చు. మందాకిని నదికి సమీపంలో గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో ఈ ఆల‌యం ఉంది. తీవ్రమైన తీవ్ర‌మైన ప్ర‌తికూల వాతావ‌ర‌ణంలో ఆల‌యానికి చేరుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ ఏడాది సుమారు రెండు ల‌క్ష‌ల మంది భ‌క్తులు ద‌ర్శించుకున్న‌ట్టు ఆల‌య నిర్వాహకులు పేర్కొంటున్నారు.

ఆరు నెల‌లే పూజ‌లు..

కేదార్‌నాథ్ ఆల‌యం ఏడాదిలో కేవ‌లం ఆరు నెల‌లు మాత్ర‌మే తెరిచిఉంటుంది. ఏప్రిల్ (అక్షయ తృతీయ), నవంబరు (కార్తీక్ పూర్ణిమ, శరదృతువు పౌర్ణమి) మధ్య మాత్రమే సాధారణ ప్రజలకు తెరిచి ఉంటుంది. శీతాకాలంలో కేదార్‌నాథ్‌ ఆలయం నుంచి దేవతా విగ్రహాన్ని దికి తీసుకువచ్చి ఉక్రిమత్ ప్రదేశంలో తదుపరి ఆరు నెలలవరకు పూజలు నిర్వహిస్త్తారు. ఈనేప‌థ్యంలో పెద్ద సంఖ్య‌లో భక్తులు
భూకుంత్ భైరవనాథుని ఆశీస్సులు అందుకుంటారు. అనందిగా వ‌స్తున్న ఆచారం ప్ర‌కారం కేదార్‌నాథ్ ధామ్ తలుపులు మూసే ముందు ప్రత్యేక పూజలు చేస్తారు. శీతాకాలం వస్తున్న నేపథ్యంలో ఆదివారం నుంచి ఆల‌యాన్ని మూసివేసేందుకు పండితులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పూజ‌ల అనంత‌రం కేదార్‌నాథ్ ద్వారపాలకుడైన భుకుంత్ భైరవనాథ్ ఆలయ తలుపులు మూసివేస్తారు. ఈ మేర‌కు శనివారం ప్రత్యేక పూజలు చేసిన త‌ర్వాత ఆలయంలో కేదార్‌బాబా పంచముఖి డోలీని ఈమేర‌కు ప్ర‌తిష్ఠిస్తారు.ఇదిలా ఉంటే ఆరు నెలల పాటు, ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో భోలే బాబా ఆరాధన, దర్శనం జరుగుతాయి.

 

– క్లిక్ చేసి ఇవి కూడా చ‌ద‌వండి-

విస్త‌రిస్తున్న షుగ‌ర్ డాడీ.. ఆ ప‌నికోస‌మేనా..

మహేష్‌ బాబు కోసం రాజమౌళి వెతుకులాట

రికార్డు సృష్టించిన అయోధ్య

న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్‌

దొరికిన కుంభకర్ణుడి ఖడ్గం

రామగుండం కొత్త చరిత్ర

బీజేపీలో ముస‌లం.. నెక్ట్స్ బాస్ ఎవ‌రంటే..?

2 thought on “కేదార్‌నాథ్ ఆల‌యం మూసివేత‌.. మ‌ళ్లి తెరుచుకునేది ఎప్పుడంటే..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *