Elan musk:ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ పంట పండనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా వ్యహరించిన మస్క్‌, తాను మద్దతు ఇచ్చిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించడంతో ఆనందంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ట్రంప్‌కు మద్దతుగా ఈ ఎన్నికల్లో మస్క్‌ విస్త్రృత ప్రచారం చేశాడు. అధ్యక్ష పోటీలో నిలిచిన డెమోక్రటీ పార్టీకి వ్యతిరేకంగా ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీకి మద్దతుగా అమెరికాలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించడంలో ఎలాన్‌ మస్క్‌ అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఈ ఎన్నికల నేపథ్యంలో చాలా రోజుల నుంచే మస్క్‌ డెమోక్రటిక్‌ పార్టీకి వ్యతిరేకంగా తన వ్యూహాలకు పదునుపెట్టారు.

 

ట్రంప్‌ పార్టీ కోసం రూ.1500కోట్ల విరాళం

మస్క్‌ (Elan musk) రాజకీయంగా ట్రంప్‌ను మొదటినుంచీ మద్దతుగా వ్యవహరించారు. ప్రత్యర్థులు ట్రంప్‌పై విమర్శలు చేసినా మస్క్‌ అంతే ఘాటుకు తిప్పికొట్టారు. అంతేకాదు, ఇటీవల కాలంలో రిపబ్లికన్ల పార్టీకి తరపున పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ కూడా మస్క్‌ ఏర్పాటు చేయడం విశేషం. కమిటీతో ఏర్పాటుతో ఆగిపోకుండా ఏకంగా రూ.1500కోట్లకు పైగా విరాళాలు మస్క్‌ అందించడం అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

 

స్వింగ్‌ రాష్ట్రాల్లోనూ మాస్టర్‌ ప్లాన్‌..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా వ్యహరించే స్వింగ్‌ రాష్ట్రాల్లో మస్క్‌ తనదైన ముద్రవేశారు. ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలీకృతుడయ్యాడు. తన యాక్షన్‌ ప్లాన్‌తో వ్యూహాలు రూపొందించి విజయవంతంగా అమలు చేశారు. ఓటర్లకూ ప్రైజ్‌మనీలను ఇచ్చారు. ముఖ్యంగా వాక్‌ స్వాతంత్య్రం, తుపాకీ కలిగి ఉండే హక్కులపై రూపొందించిన పిటిషన్‌పై మస్క్‌ సంతకాలు చేసే ఓటర్లకు విరివిగా ప్రైజ్‌మనీ ఇచ్చారని అమెరికాలో ప్రచారం జోరుగా సాగింది. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ రిపబ్లికన్లపై డెమోక్రాట్లు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. రోజుకు మిలియన్‌ డాలర్ల చొప్పున ప్రైజ్‌ మనీ పంచుతూ పోయారని ప్రచారం. ఇదే స్వింగ్‌ రాష్ట్రాల్లో ట్రంప్‌ భారీ విజయానికి మస్క్‌ లాటరీ ప్లాన్‌ ఓ కారణమని ప్రచారం జోరుగా సాగుతోంది.

 

ట్రంప్‌ గెలుపే లక్ష్యంగా..

ఎలాన్‌ మస్క్‌ అధ్యక్ష బరిలో డోనాల్డ్‌ ట్రంప్‌ గెలుపే పలక్ష్యంగా పావులు కదిపారు. ఒకదశలో అదే ఏకైక ఎజెండా మస్క్‌ పెట్టుకున్నట్టు అమెరికనట్లు పేర్కొంటున్నారు. ఫిలడెల్ఫియాలో సోలోగా కూడా మస్క్‌ ప్రచారం చేశారు. ట్రంప్‌పై కాల్పులు జరిగిన పెన్సిల్వేనియా సభకూ ఆయన హాజరుకూడా అయ్యారు.

 

మస్క్‌కు కీలక పదవి ఇవ్వనున్న ట్రంప్‌

రిపబ్లికన్‌ పార్టీ గెలుపుకోసం తీవ్రంగా కృషి చేసిన టెస్లా కంపెనీ అధినేత, ఎలాన్‌ మస్క్‌కు నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక పదవిని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. తాను అధికారంలోకి వస్తే మస్క్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటామని ఇంతకు ముందే ట్రంప్‌ ప్రకటించారు. ఒకవేళ అది సాధ్యపడకపోతే సలహాదారుగా నియమించుకుంటానని ప్రచార సమయంలోనే ట్రంప్‌ చెబుతూ వచ్చారు. ఈక్రమంలో అతడు ట్రంప్‌ పాలనలో కీలకంగా వ్యవహరించే అవకాశముంది. అయితే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ విభాగానికి అధిపతిగా చేయాలని తన అంతరంగాన్ని బయటపెట్టారు. విజయం సాధించాక ట్రంప్‌ చేసిన ప్రసంగంలో ట్రంప్‌ మస్క్‌ను స్టార్‌గా, అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించడం చూస్తుంటే మస్క్‌ రానున్న రోజుల్లో అమెరికా ప్రభుత్వంలో కీలకంగా మారే అవకాశముందని తెలుస్తోంది.

 

–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్‌ చేసి చదవండి–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *