c : మరో రెండు వందే భారత్ రైళ్లు ప్రజలకు చేరువకానున్నాయి. 20841/20842 నంబరుతో పూరి–విశాఖపట్నం–పూరిల మధ్య శనివారం మినహాయించి వారానికి ఆరు రోజులు వందేభారత్ నడుస్తాయని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. అలాగే 20841 నంబరు రైలు పూరిలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఇటు నుంచి 20842 నంబరుతో మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 11.30 గంటలకు పూరి చేరుకుంటదని వెల్లడిస్తున్నారు. ఈ రైలు ఖుర్దా రోడ్, బరంపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం స్టేషన్లలో ఆగుతుంది.
అలాగే, విశాఖపట్నం–సికింద్రాబాద్ vandebarat express మధ్య కొత్తగా ప్రారంభించే రైలు 20707/20708 నంబర్లతో గురువారం తప్ప మిగిలిన రోజులు నడుస్తుంది. 20707 నంబరుతో సికింద్రాబాద్‌లో ఉదయం 5.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖపట్నం వస్తుంది. 20708 నంబరుతో ఇక్కడ మధ్యాహ్నం 2.35 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 11.20 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో హాల్టింగ్ ఇస్తున్నట్టు వెల్లడించారు.