VANDEBHARATH TRAIN: ఇండియాలో త్వరలో వందేభారత్ రైళ్లు దసుకుపోనున్నాయి. వందేభారత్ రైళ్లు ప్రయాణికులు భారీగా ఆదరిస్తుండగా, తాజాగా గంటకు 180 కి.మీ వేగంతో పరిగెత్తే వందేభారత్ స్వపీర్ కోచ్‌లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. రైల్వే శాఖ రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో రైలు గరిష్ఠంగా గంటకు 180 కిలోవిూటర్ల వేగాన్ని అందుకున్నట్లు తెలిసింది. ఈమేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో వందే భారత్ స్లీపర్ రైలు 180కిలోవిూటర్ల వేగంతో రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. రాజస్థాన్‌లోని కోటా రైల్వే డివిజన్‌లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాల మేరకు ఈ పరీక్షలు నిర్వహించారు.
VANDEBHARATH TRAIN: తొలుత జనవరి 1న రైలును 130 కి.విూ వేగంతో నడిపారు. తర్వాత వేగాన్ని 140, 150, 160కి పెంచారు. ఇప్పుడు 180 కిలోవిూటర్లకు పెంచారు. రాజస్థాన్‌లోని కోటా నుంచి లబాన్ స్టేషన్ల మధ్య 180 కివిూ వేగంతో దూసుకెళ్లింది. వచ్చే నెలలోనూ ఈ ట్రయల్స్ కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. స్లీపర్ రైల్లో 16 బోగీలు, 10 థర్డ్ ఏసీకి, 4 సెకండ్ ఏసీకి, బోగీ ఫస్ట్ ఏసీకి కేటాయించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రైలులో సీటింగ్‌తో పాటు లగేజీ కోసం రెండు బోగీలు ఉంటాయి. కొత్తగా వందేభారత్ స్లీపర్ కోచ్ పరీక్షల నిమిత్తం కోటకు వచ్చింది. అక్కడ దానిపై బరువు ఉంచి, వేర్వేరు వేగంతో ఖాళీగా రన్ చేయడం ద్వారా పరీక్షించారు. అందులో బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ సస్పెన్షన్, కప్లర్ ఫోర్స్‌లను పరీక్షించారు.
ఈ రైలును గంటకు 180 కి.విూ వేగంతో నడిపారు. ఈ పరీక్ష డిసెంబర్ 31 నుంచి కోట రైల్వే డివిజన్‌లోని ఢల్లీి-ముంబై రైల్వే ట్రాక్‌పై ప్రారంభమైంది. ఇందులో వందే భారత్ ట్రయల్ మొదట నాగ్డా మధ్య.. తర్వాత సవాయి మాధోపూర్, కోట మధ్య నిర్వహించబడుతోంది. పరీక్షల అనంతరం పూర్తి నివేదికను రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డుకు పంపనుంది. అంతా సవ్యంగా ఆగితే అతిత్వరలోనే వేగంవంతమైన రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.