VIJAY political party: చెంగల్పట్టు : తమిళ స్టార్ విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ తనదైన మార్క్ చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు. తమ అభిమాన నటుడు తీసుకున్న నిర్ణయంతో అటు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఫిదా అవుతున్నారు. నటుడు విజయ్ ‘తమిళగ వెట్రి కజగం(కేవీకే-
) పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. పార్టీ కార్యకలాపాలను ఇటీవల ముమ్మరం చేశారు. ఇందుకోసం ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్ వాయిదా వేసుకొన్నారు. కొత్త ప్రాజెక్టులకు ఆయన నో చెప్పడంతో పార్టీపై పూర్తిస్థాయిలో దృష్టి సాధించినట్టు తెలుస్తోంది.
చంగల్పట్టు..
తమిళనాడులోని చెంగల్పట్టు పట్టణంలో ఆపార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం చేపట్టలేదు. కానీ విజయ్VIJAY politicalp arty మాత్రం అక్కడే సమావేశానికి ఏర్పాటు చేయడంతో తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈమేరకు చెంగల్పట్టు పట్టణంలో భారీగా విజయ్,VIJAY political party పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి. అక్టోబరు 27న(ఆదివారం) విల్లుపురం జిల్లాలోని విక్రమంది ప్రాంతంలో ఈ సమావేశాలు అట్టహాసంగా జరగనున్నాయి. సమావేశాల కారణంగా ప్రాంతంతా ఫ్లెక్సీలతో నిండిపోయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకీ సై…
కాగా నటుడు విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న కేవీకే పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారు. పార్టీ ప్రధానకార్యాలయం చెన్నైలోని పనైయూర్‌లో ఉంది.ఫిబ్రవరిలోనే పార్టీ స్థాపించిన అప్పడే వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాలేదు. 2026లో వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమిళగ వెట్రి కళగం పార్టీ అన్ని స్థానాల నుంచి పోటీ చేసేందుకు సమాయత్తమవుతోంది. ఈమేరకు పార్టీ అధినేత విజయ్ తగిన వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి తగిన గుర్తింపు కోసం పార్టీ తగిన కసరత్తు చేస్తోంది.