CHANDIPURA VIRAS: కొత్త వైరస్ ప్రజల్ని భయకంపితుల్ని చేస్తోంది. కొత్త వైరస్ రోజురోజుకూ విస్తరిస్తుండడంతో వైద్యలు కంగారుపడుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్ 14మంది ఇప్పటికే చనిపోవడంతో మరింత కలవర పెడుతోంది. వివరాల్లోకి వెళితే..
గుజరాత్ రాష్ట్రంలో చండీపురా (CHANDIPURA VIRAS)అనే కొత్త వైరస్ విస్తరిస్తోంది. ఈ వైరస్ లక్షణాలతో ఇప్పటికే 9 మంది చనిపోయినట్టు అధికారులు పేర్కొంటున్నారు. చండీపురా వైరస్ మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉండడం బాధికరం. సబర్‌కాంత జిల్లాలోని హిమత్ నగర్‌లోని ఒక ఆసుపత్రిలో వారం రోజుల క్రితం ఆరావళికి చెందిన నాలుగేళ్ల బాలికకు చండీపురా పాజిటివ్‌గా తేలింది. అలాగే గోఘంబలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆనెల ఆరున చిన్నారి మృతి చెందగా, ఆమెకు కూడా వైరస్ కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు సబర్‌కాంత, ఆరావళి, మహిసాగర్, ఖేడా, మెహసానా, రాజ్‌కోట్ జిల్లాల్లో కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రిషికేష్ పటేల్ వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాజస్థాన్ లకు చెందిన చిన్నారులు ప్రస్తుతం గుజరాత్‌లో చికిత్స పొందుతున్నట్టు మంత్రి వెల్లడించారు. సబర్‌కాంత జిల్లాకు చెందిన ఇద్దరు, ఆరావళికి చెందిన ముగ్గురు, మహిసాగర్, రాజ్‌కోట్ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు వైరస్ బారిన పడి చికిత్స పొందుతూ ఇప్పటి వరకు మృతిచెందారు.
29 పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.
ఇలాగైతే చండీపురా వచ్చినట్టే..
మహారాష్ట్రలో ఈ వైరస్1964లో తొలిసారిగా కనిపించింది. చండీపురాలో దీన్ని గుర్తించగా, నాటినుంచి ఈ వైరస్‌కు ఆపేరే పెట్టారు. నాడు పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది. ఆ తరువాత మళ్లీ దీని కనిపించలేదు. ఇప్పుడు గుజరాత్‌లో శరవేగంగా విస్తరిస్తోండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇది రాబ్డోవిరిడే కుటుంబానికి చెందిన వెసిక్యులో- వైరస్ జాతికి చెందినదిగా వైద్యలు పేర్కొంటున్నారు.
వైద్యం లేని వైరస్..
మందిలేని కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తే, అదే తరహాలో చండీపురా వైరస్‌ను భయపెడుతోంది. దీని నియంత్రణకు ఇప్పటి వరకు వ్యాక్సిన్ గానీ లేకపోవడం ఆందోళనకలిగిస్తోంది.