KALVAKUNTLA KAVITHA: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయ, మాజీ ఎంపీ కల్వకుంట కవిత పొలిటికల్‌ రీ ఎంట్రీకి ఇదే మంచి తరుణమని బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. లిక్కర్‌ స్కాంలో ఇరుక్కున్న కవిత కొంతకాలం జైలు జీవితం గడిపారు. బెయిల్‌పై విడుదలైన కవిత ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. ఒకవేళ న్యాయ పరమైన చిక్కులు లేకుంటే ప్రజాక్షేత్రంలోకి రావడానికి ఇదేమంచి సమయమంటూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు పేర్కొంటున్నాయి.

READ MORE: టార్గెట్ కేసీఆర్‌.. నోరు మెదప‌ని కేసీఆర్‌.. క్యాడ‌ర్ లో అయోమ‌యం

డోసు పెంచిన సీఎం రేవంత్‌

KALVAKUNTLA KAVITHA: ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కల్వకుట్ల ఫ్యామిలీని టార్గెట్‌ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అవినీతి, అక్రమార్కులంటూ పేర్కొంటూనే పలు రకాల సవాళ్లు విసురుతున్నారు. ఒక అడుగు ముందుకువేసి కేసీఆర్‌పై తన మాటతో దూకుడు పెంచారు. అయితే ఎప్పటికప్పుడు మాజీ మంత్రి కె.తారకమారావు, హరీష్‌రావులు తిప్పికొడుతున్నారు. తను ఏ తప్పు చేయలేదంటున్న కవిత కూడా జనంలోకి వస్తే కాంగ్రెస్‌ దూకుడుకు కల్లెం వేయవచ్చని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కవిత కూడా కార్యకర్తల్లో ఉత్సాహం నింపితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ సాధ్యమైనంత ఎక్కువ సీట్లను గెలుచుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తన్నారు.

READ MORE:  ఇండియా గేట్ వ‌ద్ద‌.. యువ‌తి బ‌హిరంగంగానే ట‌వ‌ల్ తో అలా చేస్తూ..

మారుతున్న వ్యూహాలు..

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ మారుతున్నాయి. త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారులు సన్నాహాలు చేస్తున్న వేళ బీఎస్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి జిల్లాలకు వరాల జల్లులు కురిపిస్తూ జిల్లాలబాట పట్టారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ లేకుండా చేయాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇలాంటి ఎత్తుగడలు వేయడం పరిపాటే. కానీ, ప్రతివ్యూహంతో ముందుకు సాగడమే ప్రధానం. తెలంగాణ కాంగ్రెస్‌కు బీజేపీ, బీఆర్‌ఎస్‌లే పోటీ. అయితే గ్రామస్థాయిలో బీజేపీ ప్రభావం అంతంతమాత్రమే ఉంటుంది. ఇక మిగిలింది బీఆర్‌ఎస్‌ మాత్రమే. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న ఆ పార్టీని దెబ్బకొట్టేందుకు సీఎం భారీ ప్లానింగ్‌తో ముందుకు పోతున్నారు. ఇంటికే పరిమితమైన కేసీఆర్‌ను బయటిరావాలంటూ సవాల్‌ విసురుతున్నారు. కారణం ఏమిటో తెలియదుకానీ, కేసీఆర్‌ నుంచి స్పందన రాకపోవడంతో కాస్త గందరగోళంలో ఉన్నారు.

READ MORE: సీఎం ప్లాన్‌కు విప‌క్షాలు షాక్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *