WARANGAL(PRATHAPARUDRA HILL): మనసును ఆహ్లాద ప్రదేశాలు దేశంలో ఎన్నో ఉన్నా.. తెలంగాణలోని ఓ ప్రాంతం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది. దట్టమైన అరణ్యంలో పెద్ద గుట్ట.. దానిపై రక్షణ దుర్గం.. కనువిందు చేసే సెలయేళ్లు.. వీనులవిందు చేసే పక్షులు సందర్శకులను ఆనంద డోలికల్లో ముంచెత్తుతోంది.. ఇంతకీ ప్రాంతం ఎక్కడ ఉందంటే వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ఉంది ప్రతాపగిరి గుట్టలు. జాతీయ రహదారికి కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో అటివి మధ్యలో ఉందీ ప్రతాపగిరి గుట్ట. ఈ గుట్టకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
READ MORE: తిరుమల రహస్యాలు ఇవిగో.. స్వామి వారి మహిమ.. లేక..
అప్పట్లోనే ఐదంచెల రక్షణ వ్యవస్థ..
కాకతీయుల వంశ చివరి రాజు ప్రతాపరుద్ర–2 (రుద్రదేవ–2) పాలనలో గుట్టపై కాకతీయ రాజుల దుర్గం ఉంది. సుమారు ఐదువందల మీటర్ల పైగా ఎత్తులో ఉన్న ప్రతాపగిరి గుట్టపై కాకతీయులు ఐదంచెల రక్షణ వ్యవస్థతో ఈ దుర్గం నిర్మించిన ఆనవాళ్లు ఉన్నాయి. శత్రువుల నుంచి రక్షణ కోసం కాకతీయ సేనాని ఆధ్వర్యంలో నాయంకరుల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతాపరుద్రుడిపై ఢిల్లీ సుల్తాన్ సేనలు దాడి చేయగా, వారి నుంచి తప్పించుకొని గొంతెమ్మ గుట్ట, పక్కనే ఉన్న పెద్ద గుట్టపై సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసినట్టు అక్కడి ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. అందుచేతనే ఆ గుట్టకు ప్రతాపగిరిగా పేరు వచ్చినట్టు చెబుతుంటారు.
READ MOREA; మబ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచారం..
శ్రతువులు రాకుండా ఏం చేశారంటే..
WARANGAL(PRATHAPARUDRA HILL): ప్రకృతి అందాల మధ్య ఉన్న ఈ గుట్టపైకి వెళ్లేందుకు మూడు ప్రధాన ద్వారాలున్నాయి. ప్రధాన స్థావరానికి తొమ్మిది దర్వాజాలున్నట్టు చరిత్రకారుఉలు చెప్తున్నారు. ఈ ద్వారంపై మైసమ్మ విగ్రహం, ఇరువైపులా చెక్కిన నాట్యకత్తెల విగ్రహాలున్నాయి. ప్రధాన ద్వారం వద్ద పెద్ద గోడపై రాతి శాసనం ఆనవాలు ఉన్నాయి. ఆరు కిలోమీటర్ల వరకు చుట్టూ రాతిగోడ నిర్మించారు. సైనికుల అవసరార్థం గుట్టపై స్నానాల గదులు, పెద్ద కొలనులు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. శత్రువులు లోపలికి రాకుండా ఉండేందుకు ప్రధాన ద్వారం చుట్టూ పెద్దపెద్ద కందకాలు ఉన్నాయి. అప్పట్లో వాటిలో మొసళ్లను విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. సైన్య కాపలాకు బురుజులు కూడా ఉన్నాయి. లోపల నుంచి బయటకు వెళ్లేందుకు గుట్టపైకి పలు సొరంగ మార్గాలు ఉన్నాయని స్థానికులు ఇప్పటికీ చెబుతుంటారు.
READ MORE : షుగర్ డాడీ.. పల్లెలకు విస్తరించిన విష సంస్కృతి
గుప్తనిధుల కోసం తవ్వకాలు..
గుప్త నిధుల కోసం కొందరు ఎక్కడికక్కడే తవ్వకాలు జరిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చుట్టూ అడవి ఉండడంతో యథేచ్ఛగా ఇప్పటికీ తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. దుర్గంలో పెద్ద పెద్ద బండరాళ్లను తొలగించారు.. నాటి ఆనవాళ్లను చెరిపేస్తున్నారు. శతాబ్దాల నాటి చారిత్రక సంపద విశేషాలు, ప్రకృతి సోయగాలకు నెలవైన ప్రతాపగిరిని ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలంటూ పర్యాటకులు కోరుతున్నారు.