వరంగల్ జిల్లా కేంద్రంము లుగు రోడ్డు ఇండస్ట్రియల్ ఏరియాలో అధ్భుతం చోటు చేసుకుంది. మంగళవారం తవ్వకాల్లో పెద్దమ్మతల్లి విగ్రహం బయటపడింది.పురాతన విగ్రహాల వద్ద నాగసర్పాలు ఉన్నాయంటే సుమారు 1000 సంవత్సరాలు పురాతనమైనవిగా చరిత్ర చెబుతుందనన్నారు. కాకతీయులు ఓరుగల్లును పరిపాలించే సమయంలో మొదటి నుండి చిట్టచివరి గణపతి దేవుడు వారు శైవామతాన్ని శివుడిని, అమ్మవారిని పూజించిన చరిత్ర మనకు ఉంది. ఓరుగల్లులో భద్రకాళి అమ్మవారు, హన్మకొండ లో హనుమద్గిరి పద్మాక్షి అమ్మవార్లు వున్నారు. గతంలో పెద్దమ్మ గడ్డ పేరు వచ్చిందంటే పెద్దమ్మ తల్లి దేవాలయం ఉండేది అని చరిత్ర చెప్తుంది. ఇప్పుడు ఈ భూమి తవ్వాకల్లో ఆ పెద్దమ్మ తల్లి విగ్రహం బయటపడింది. మనకి ఎక్కడికి వెళ్లిన అడుగడుగునా శివలింగలు, అమ్మవారి విగ్రహాలు వున్నాయి. నగరంలో ఒక వైపు భద్రకాళి అమ్మవారు, మరో వైపు పద్మాక్షి అమ్మవారు మధ్యలో పెద్దమ్మ తల్లి నగరంలో ఎలాంటి దుష్టాశక్తులు రాకుండా నగర ప్రజలను కాపాడుతూ సుఖ సంతోషాలతో జీవించడానికి ఉండేవారు. అలాంటి పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ఒక చోటపెట్టి గుడిని ప్రతిష్టిచాలని కోరుతున్నాం.
వరంగల్ హిస్టరీ..
తెలంగాణ రాష్ట్రం ఉంది వరంగల్. ఇది కాకతీయుల రాజధాని ఓరుగల్లుగా గుర్తింపు పొందింది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంవరంగల్ . 2014 2008 జనవరిన మహా నగరంగా మారింది. వరంగల్ కి మరోపేరు ఓరుగల్లు. 1163లో స్థాపించబడిన కాకతీయుల రాజధానిగా వరంగల్ ఉండేది. కాకతీయులు నిర్మించిన స్మారక కట్టడాల్లో కోటలు, సరస్సులు, దేవాలయాలు, రాతి ద్వారాలు ప్రస్తుతం నగరం ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా మారడానికి దోహదపడ్డాయి.
భారత ప్రభుత్వం హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన పథకానికి ఎంపిక చేసిన దేశంలోని పదకొండు నగరాల్లో వరంగల్ ఒకటి. వరంగల్ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద పట్టణ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అవకాశాలను మెరుగుపరచడానికి అదనపు పెట్టుబడులకు అర్హత సాధించే “ఫాస్ట్ ట్రాక్ పోటీ”లో స్మార్ట్ సిటీగా ఎంపిక చేయబడింది. ప్రధాన స్టేషన్లు కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్, వరంగల్ రైల్వే స్టేషన్.
[…] 2. వరంగల్లో అద్భుతం […]