MAHARASTRA CM : మహారాష్ట్రలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కూటమి సభ్యుల్లో ఎవరు ముఖ్య మంత్రి అనేది ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులవుతున్నా.. సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయం లేకుండా పోయింది. శాసనసభ గడువు మంగళవారంతో ముగిసినా కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై మహారాష్ట్రలో ఉత్కంఠ వీడడం లేదు. కూటమి(మహాయుతి) ఒక్కతాటిపైకి వచ్చేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.
READ MORE: టార్గెట్ కేసీఆర్.. నోరు మెదపని కేసీఆర్.. క్యాడర్ లో అయోమయం
ఫడ్నవీస్.. ఏక్‌నాథ్ షిండే .. ఎవరి…
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో బీజేపీకి 132, శివసేనకు 57, ఎన్సీపీకి 41 స్థానాలు దక్కించుకుంది. బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకున్నందున తమ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలంటూ బీజేపీ పట్టుబడుతోంది.
READ MORE: సీఎం ప్లాన్ -బి సక్సెస్ అయిందా..
షిండే నాయకత్వంలోనే ఈ ఎన్నికల్లో తమ కూటమి గెలుపొందినందున ఏక్‌నాథ్ షిండేనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని శివసేన కార్యకర్తలు కోరుతున్నారు. సీఎం పదవి దక్కని పక్షంలో షిండే వర్గం ప్లాబ్-బీని సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఏక్‌నాథ్ షిండేని ముఖ్యమంత్రి చేయాలని శివసేన పార్టీ డిమాండ్ చేస్తోంది.
అయితే తాజాగా, కాస్త బెట్టు వీడి షిండేకు కనీసం హోం మంత్రి ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది. ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రి(MAHARASTRA CM)ని చేసి ఏక్‌నాథ్ షిండేను కేంద్రమంత్రిగా, ఆయన కుమారుడు శ్రీకాంత్ షిండేను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చే అవకాశముందని ప్రచారం సాగుతోంది. మరో ఉప ముఖ్యమంత్రి పదవి అజిత్ పవార్‌ను ఇస్తారని సమాచారం. కూటమిలోని మూడు పార్టీలకు ఇదే మంచిదనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది.
READ MORE: సెల్ఫ్‌గోల్‌లో కాంగ్రెస్.. సమీపిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు
రాష్ట్రపతి పాలన వస్తుందా..
గత ప్రభుత్వ పాలన నిన్నటితో(నవంబరు 26)తో ముగిసింది. కూమిటి ఇంకా ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాకపోవడం మహారాష్ట్రంలో ఆసక్తి నెలకొంది. సీఎం అభ్యర్థి విషయంలో ఓ కొలిక్కి రావడానికి మరింత సమయంపట్టే ఛాన్స్ ఉంది. ఒకవేళ అదే జరిగే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలుచేస్తారా అన్న చర్చ సాగుతోంది. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేవరకూ ఆపద్ధర్మంగా కొనసాగాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ షిండేను కోరారు.
READ MORE: ఇండియా గేట్ వద్ద యువతి టవల్ డాన్స్.. టూరిస్టులు.. ఫై..