T-BJP: హైదరాబాద్‌(జనదూత): తెలంగాణ రాష్ట్ర బీజేపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో పార్టీని నడిపే సారథి లేక పార్టీ డీలా పడుతోంది. అయితే అధ్యక్షపీఠం అధిష్టించేందుకు పలువురు విముఖత వ్యక్తం చేస్తుండడంతో ఆసక్తికరంగా మారింది. కొందరు అధిష్టానం వ్యతిరేకించడం రచ్చనీయాంశంగా మారింది. దీనికి తోడు అంతర్గత కుమ్ములాటలు మరింత తోడయ్యాయని తెలుస్తోంది. ఫలితంగా పార్టీ వర్గాలుగా చీలిపోయినట్టు బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో జి.కిషన్‌రెడ్డి (సికింద్రబాద్‌), డీకే అరుణ (మహబూబ్‌నగర్‌), బండి సంజయ్‌(కరీంనగర్‌), ధర్మపురి అరవింద్‌(నిజామాబాద్‌), గడ్డం నగేష్‌(ఆదిలాబాద్‌), ఈటల రాజేందర్‌(మల్కాజ్‌గిరి), మాధవనేని రఘునందన్‌రావు(మెదక్‌), కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి(చేవెళ్ల) నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలి వీచినా అనూహ్యం ఎమినిది మంది బీజేపీ ఎంపీలు గెలవడం విశేషం. అయినా పార్టీలో సఖ్యత లేకపోవడం, అధిష్ఠానం పట్టిచుకోకపోవడంతో పార్టీలో అంతర్గత కలహాలు పెరిగినట్టు తెలుస్తోంది. ఒకవైపు రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో బీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు పెంచింది. బీజేపీ మాత్రం స్తబ్దుగా ఉండడంతో బీజేపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీని గాడిలోపెట్టే నాయకుడి కోసం జాతీయ నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. అందరిని కలుపుకుపోవడమేకాక, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించే సారథి కోసం అన్వేషిస్తోంది. అయితే పార్టీ పగ్గాలు బీసీ నేతకే అప్పజెప్పే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి.

కిషన్‌రెడ్డి ఉన్నా.. ఏం లాభం..

సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా గెలిచిన జి.కిషన్‌రెడ్డి ప్రస్తుతం బీజేపీ (T-BJP) రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపడుతున్నారు. పార్టీకి దక్షిణాది నుంచి కీలకమైన వ్యక్తి కూడా కిషన్‌రెడ్డినే. దాంతో ఆయన నిత్యం బీజీబిజీ ఉంటున్నారు. ఇతర రాష్ట్రాల పర్యటనలు, జాతీయ రాజకీయాల్లో బిజీబిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను అంతగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా పార్టీలో నేతలంతా ఎవరికివారే యమునా తీరే అన్నట్టుగా సాగుతోంది.

వీరికి అవకాశం దక్కేనా?

బీజేపీ రాష్ట్ర పార్టీ పగ్గాలు బండి సంజయ్‌ చేపట్టాక పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన సారథిగా వ్యవహరించేందుకు అనాసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. పట్టఽభద్రుల ఎమ్మెల్సీ నారపరాజు రామచందర్‌రావు పేరును అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఆయన సౌమ్యుడు, అంతగా దూకుడుగా వ్యవహరించరనే భావన ఉంది. ఇదిలాఉంటే అయన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టికెట్‌ ఆశిస్తున్నట్టు పార్టీ(T-BJP)లో ప్రచారం సాగుతోంది. ఎంపీ రఘునందన్‌రావు పేరును కూడా తెరపైకివచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆయన అగ్రవర్ణకులం కావడం ప్రతికూలంగా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమాణారెడ్డి(కేవీఆర్‌) పేరుకూడా పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

ఈటలకు లేనట్టేనా..

బీజేపీ రాష్ట్ర పగ్గాలు మల్కజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు అప్పగిస్తారనే ప్రచారం మొదట్లో భారీగానే సాగింది. అయితే బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ మధ్య వైరం ఇందుకు ప్రతికూలంగా మారినట్టు పార్టీలో చర్చసాగుతోంది. అంతేకాక ఓ వర్గం ఈటల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *